Rakesh Tikait : వీరులకు సలాం యోధులకు లాల్ సలాం
మీ బలిదానం..త్యాగం వృధా కాదన్న తికాయత్
Rakesh Tikait : ఆంగ్లేయుల రాక్షస పాలనకు విముక్తి కలిగిన రోజు. ఈ చారిత్రాత్మకమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భారత దేశం విముక్తి పొంది నేటికి 75 ఏళ్లు పూర్తయ్యాయి.
ఇవాళ పంధ్రాగస్టును ఘనంగా నిర్వహిస్తున్నాం. యావత్ 140 కోట్ల భారతీయులందరికీ నా హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు.
ఈ దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుతున్నదంటే ప్రధాన కారణం అమర వీరుల బలిదానాలు, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలే కారణం.
వాళ్లు లేక పోతే మనం ఇలా స్వేచ్చగా ఉండేవాళ్లం కాదన్నారు భారతీయ కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait). జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా వేలాది మంది రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆనాటి స్వాత్రంత్రోద్యమ స్ఫూర్తితోనే దేశంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని చేపట్టామని అన్నారు.
బానిస సంకెళ్ల నుంచి దేశాన్ని విముక్తం చేసిన ప్రతి వీరుడికి తల వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు రాకేశ్ తికాయత్. సురక్షితమైన జీవితాన్ని ప్రసాదించినందుకు మీకు సర్వదా కృతజ్ఞులమై ఉంటామని అన్నారు.
అలుపెరుగని పోరాటంలో అసువులు బాసిన సమర యోధులను స్మరించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జాతీయ జెండా అన్నది దేశ ఆత్మ గౌరవానికి, త్యాగానికి, నిబద్దతకు, సమగ్రతకు చిహ్నమని పేర్కొన్నారు రాకేత్ తికాయత్.
దేశం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ , రాజ్ గురు , సుఖ్ దేవ్ లు ఎల్లప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని ప్రశంసించారు.
ఏ త్యాగాల పునాదుల మీద ఏర్పడిందో ఈ దేశం ఆ ఔన్నత్యాన్ని కాపాడుకునేందు మనందరం కంకణ బద్దులమై ఉండాలని పిలుపునిచ్చారు రాకేశ్ తికాయత్.
Also Read : దేశంలోని ప్రతి భాష గురించి గర్వపడాలి