Rakesh Tikait : కేంద్ర స‌ర్కార్ తీరుపై తికాయ‌త్ ఫైర్

ప‌త్తి మిల్లుల‌కు ల‌బ్ది చేకూర్చే నిర్ణ‌యం

Rakesh Tikait  : భార‌తీయ కిసాన్ యూనియ‌న్ జాతీయ అధికార ప్ర‌తినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ తికాయ‌త్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. మోదీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై మండిప‌డ్డారు.

ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప‌త్తి రైతుల ప‌ట్ల వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శిస్తోందంటూ ఆరోపించారు. దేశంలో గ‌తంలో కంటే ఈసారి ప‌త్తి పంట‌ను గ‌ణ‌నీయంగా సాగు చేశార‌ని తెలిపారు.

అయితే ప‌త్తి మిల్లు య‌జ‌మానుల‌కు ల‌బ్ది చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు మొత్తం 11 శాతం దిగుమ‌తి సుంకాన్ని ఎత్తి వేసింద‌ని మండిప‌డ్డారు రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait ).

దీని వ‌ల్ల రైతుల నోట్ల మ‌ట్టి కొట్టారంటూ ఫైర్ అయ్యారు. ప‌త్తి సాగు చేసిన రైతుల‌కు భారీ ఎత్తున ధ‌ర‌లు వ‌చ్చాయ‌ని దీనిని జీర్ణించు కోలేని మోదీ ప్ర‌భుత్వం వారి పొట్ట కొట్టే ప్ర‌య‌త్నం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రైతుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌భుత్వం ప‌ని చేయాల‌ని లేక పోతే ఉద్య‌మిస్తామ‌ని రాకేశ్ తికాయ‌త్ హెచ్చ‌రించారు. రైతుల ఉద్య‌మంతో దిగి వ‌చ్చిన కేంద్రం కావాల‌ని ఇబ్బందుల‌కు గురి చేస్తోందంటూ సీరియ‌స్ అయ్యారు.

తాము రైతులు పండించిన ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని కోరుతున్నామ‌ని తెలిపారు. చ‌ట్టాలు ర‌ద్దు చేసినా ఈరోజు వ‌ర‌కు రైతుల‌పై న‌మోదు చేసిన కేసుల‌ను మాఫీ చేయ‌లేద‌ని, ఇప్ప‌టికీ రైతులు ఇంకా జైళ్ల‌ల్లోనే ఉంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాకేశ్ తికాయ‌త్.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని సూచించారు రైతు నేత‌.

Also Read : ద్వేష‌పూరిత బుల్డోజర్ల‌ను ఆపండి

Leave A Reply

Your Email Id will not be published!