MP Santosh Kumar : ఎంపీ సంతోష్ కు చెర్రీ కంగ్రాట్స్
వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ పుస్తకం
MP Santosh Kumar : ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. బీఆర్ఎస్ లో ఎక్కడా కనిపించక పోయినా చక్రం తిప్పేది ఆయనే అనేది బహిరంగ రహస్యం. ఇక చెట్లను, మొక్కలను నాటాలని ప్రచారం చేస్తున్నారు. బహుశా రేపొద్దున కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఆయనకు ఏదైనా అవార్డు కూడా ఇస్తుందేమో చూడాలి. ఓ వైపు రాష్ట్రంలో సమస్యలతో జనం కొట్టుమిట్టాడుతుంటే సదరు ఎంపీ పార్లమెంట్ లో వారి తరపున గళం విప్పిన దాఖలాలు లేవు.
MP Santosh Kumar Got Appreciated From Cherry
మొక్కలు నాటడంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar). తాజాగా ఆయన ప్రముఖ నటుడు రామ్ చరణ్ ను కలిశారు. ఆయనకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం. దీనికి సంబంధించి ఆకర్షణీయమైన కాఫీ టేబుల్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫ్యాషన్ ను మెచ్చుకున్నారు చెర్రీ. ప్రకృతి సౌందర్యాన్ని ఇందులో బంధించే ప్రయత్నంచేశారు. ఈ సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ ను రామ్ చరణ్ మెచ్చుకున్నారు. ఆయనను వెన్నుతట్టి ప్రోత్సహించారు.
ఓ వైపు ఎంపీగా ఉంటూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు చెర్రీ. మొత్తంగా సంతోష్ కుమార్ చెర్రీతో దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా తనను అభినందించిన నటుడు రామ్ చరణ్ కు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
Also Read : Lokesh Grand Welcome : దుర్గమ్మ సాక్షిగా లోకేష్ కు వెల్ కమ్