Ram Gopal Varma : పవన్ కళ్యాణ్ కు 9 ప్రశ్నలు
జవాబు చెప్పాలన్న ఆర్జీవీ
Ram Gopal Varma : హైదరాబాద్ – వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి సెంట్రల్ జైలు పాలైన టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడుకి బేషరతు మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ ను నిలదీశారు. ఏ ప్రాతిపదికన మద్దతు ఇస్తున్నావో చెప్పాలన్నారు.
Ram Gopal Varma Asking Pawan Kalyan
సోమవారం ట్విట్టర్ వేదికగా 9 ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పాలని కోరారు. అసలు స్కిల్ స్కామ్ జరిగిందా లేదా , ఒకవేళ జరిగి ఉంటే చంద్రబాబుకు తెలియకుండా జరిగిందా అని ప్రశ్నించారు. రూ. 371 కోట్ల ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో కాకుండా , ఆఫీసర్స్ చెబుతున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా , ఒక వేళ తెలిసినా ఎందుకని చర్య తీసుకోలేదని నిలదీశారు.
ఎఫ్ఐఆర్ అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు మాత్రమే. ఆ తర్వాత ఎప్పుడైనా ఎవరి పేరునైనా చేర్చవచ్చన్న విషయం నీకు తెలియక పోవడం దారుణమన్నారు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). సీఐడీ పక్కా ఆధారాలు సమర్పించిన తర్వాత కూడా బెయిల్ ఇవ్వక పోవడం జడ్జి తప్పు ఎలా అవుతుంది పవన్ అంటూ నిప్పులు చెరిగారు.
సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ తీర్పు ఇచ్చిన జడ్జిది ఎలా తప్పు అవుతుందన్నారు. 40 ఏళ్లు అనే దానిని బట్టి తీర్పు ఇవ్వరని, వాళ్లు చేసే పనుల బట్టి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక చివరి ప్రశ్న స్కిల్ స్కాంలో మీకు అర్థం అయ్యిందో, దానిలోని తప్పులు ఏంటో ఒక వీడియో రూపంలో చెబితే సంతోషిస్తానన్నారు.
Also Read : MP Vijay Sai Reddy : బాబు కథ ముగిసింది