ధురంధ‌ర్ -2 పై రామ్ గోపాల్ వ‌ర్మ కామెంట్స్

నూత‌న సినిమా క్ర‌మానికి పుట్టుక అన్న డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది ఆదిత్య ధ‌ర్ తీసిన దురంధ‌ర్ మూవీ. తాజాగా దీనికి కొన‌సాగింపుగా దురంధ‌ర్ ది రివెంజ్ పేరుతో కొన‌సాగింపుగా దురంధ‌ర్ -2 వ‌చ్చింది. దీనిపై ఇవాళ స్పందించాడు ఆర్జీవి. తాను ప్రివ్యూ చూశాన‌ని, అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చాడు. ఆపై దురంధ‌ర్ -2 చిత్రం నూత‌న సినిమా క్ర‌మానికి పుట్టుక లాంటిద‌ని పేర్కొన్నాడు. ఇక మూడు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధురందర్ సీక్వెల్ మార్చి 19న గురువారం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మొఘల్-ఎ-ఆజం నుండి షోలే వరకు ఇప్పటి వరకు వచ్చిన గొప్ప చిత్రాలన్నీ ఆదిత్య ధర్ తాజా చిత్రంతో పోలిస్తే “టీవీ సీరియల్స్” లాగా కనిపిస్తాయని ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తనకు ఇష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదిక‌గా ఈ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ‘ధురందర్ 2’ చూసిన తర్వాత, దాని అంచనా వసూళ్లు, ప్రేక్షకుల ఉత్సాహం, సామాజిక ప్రభావాలు, సినిమాటిక్ వ్యాకరణాన్ని బద్దలు కొట్టడం, అన్నింటికంటే ముఖ్యంగా మానసిక దృశ్య శ్రవణ ప్రభావం గ‌తంలో వ‌చ్చిన , టాప్ మూవీస్ ను అధిగ‌మించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇదిలా ఉండ‌గా ర‌ణ్ బీర్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టించిన దురంధ‌ర్ ఆశించిన దానికంటే అత్య‌ధిక సంఖ్య‌లో కాసుల‌ను కురిపించింది. బాలీవుడ్ లో వ‌సూళ్ల‌లో టాప్ లో నిలిచింది. రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!