Ram Nath Kovind : సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఉండాలి
అంబేద్కర్ జీవితం స్పూర్తిదాయకం
Ram Nath Kovind : ఈ దేశంలో అత్యున్నత పదవిలో కొలువు తీరిన వారు సమాజానికి ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. కస్టోడియన్ ఆఫ్ సొసైటీ అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి(Ram Nath Kovind) పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ, ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ, జైన మతాలకు చెందిన మత పెద్దలు ఆయనను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. రాష్ట్రపతులు ఎవరైనా సరే పదవీ విరమణ చేసిన తర్వాత రాజ్యాంగ సూత్రాలను అనుసరించాలన్నారు.
సమాజంలోని అన్ని వర్గాలు, మతాలను సమానంగా చూడడం వారి జాతీయ కర్తవ్యంగా గుర్తుంచు కోవాలని సూచించారు. ఉన్నత పదవిలో ఉన్న వారికి ధనిక, పేద అన్న భావన ఉండదన్నారు.
వారికి సమాజంలోని అన్ని వర్గాలు, మతాల వారు సమానవేనని స్పష్టం చేశారు రామ్ నాథ్ కోవింద్(Ram Nath Kovind). రామ్ నాథ్ తన ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యాక ఆయన స్థానంలో ద్రౌపది ముర్ము నూతన రాష్ట్రపతిగా కొలువు తీరారు.
భారత దేశ రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై ప్రశంసలు కురిపించారు. మన ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిని అందించారని కొనియాడారు.
మహిళా సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి, సమాజంలోని ఇతర బలహీన వర్గాల కోసం పని చేశారని కితాబు ఇచ్చారు. సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలే కూడా రామ్ నాథ్ కోవింద్ ను ప్రశంసించారు.
Also Read : ఉబెర్ తో ఓలా విలీనం అబద్దం – సిఇఓ