Ram The Warrior : వారెవ్వా రామ్ ‘ది వారియ‌ర్’

లింగుస్వామి పోస్ట‌ర్ రివీల్

Ram The Warrior : తెలుగు సినిమా రంగంలో ఎన‌ర్జ‌టిక్ హీరోగా పేరొందాడు రామ్ పోతినేని. మ‌నోడి ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ దుమ్ము రేపింది. దీనికి పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్ చేస్తే భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆ త‌ర్వాత రెడ్ తీశాడు.

అది కూడా హిట్టే. తాజాగా త‌మిళ సినిమాకు చెందిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీని తెలుగు, త‌మిళంలో వ‌స్తోంది. ఇక రామ్ పోతినేనితో పాటు ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి, అక్ష‌ర గౌడ హీరోయిన్లుగా చేస్తున్నారు.

ఇక ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ పాత్ర‌లో న‌టిస్తున్న రామ్ పోస్ట‌ర్ లుక్ అదిరింది. స‌రైనోడులో పూర్తి విల‌నిజంతో ఆక‌ట్టుకున్న ఆది పినిశెట్టి మ‌రోసారి త‌న స‌త్తా చాట‌నున్నాడు రామ్ మూవీలో. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ద‌ర్శ‌కుడు అప్ డేట్ ఇచ్చాడు.

పూర్తిగా రొమాంటిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్న దీనికి ది వారియ‌ర్ (Ram The Warrior)అని పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించి మూవీ మేక‌ర్స్ ఇవాళ సోష‌ల్ మీడియా వేదిక‌గా రామ్ తో ఉన్న పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు.

రామ్ ఫ‌స్ట్ లుక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇదిలా ఉండ‌గా సినీ కెరీర్ లో ఇప్ప‌టి దాకా పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర చేయ‌క పోవ‌డం విశేషం.

క‌థ‌నే కాదు పాత్ర‌ల ఎంపిక‌లో సైతం డిఫ‌రెంట్ గా ఉండేలా ఆరాట‌ప‌డే లింగుస్వామి ఈసారి స‌రికొత్త‌గా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రామ్ ను చూపిస్తుండ‌డం విశేషం.

శ్రీ‌నివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : న‌ట‌న‌లో సేనాని ఈ సేతుప‌తి

Leave A Reply

Your Email Id will not be published!