Raman Bhalla : స్థానికేతరుల ఓటర్ల నమోదుపై కాంగ్రెస్ ఫైర్
జమ్మూ కాశ్మీర్ లో పట్టు కోల్పోయింది
Raman Bhalla : కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పై నిప్పులు చెరిగింది. జమ్మూ కాశ్మీర్ లో ఆ పార్టీ స్థానికుల మద్దతు కోల్పోయిందని ఆరోపించింది. అందు వల్లనే తెలివిగా 25 లక్షల మంది స్థానికేతరుల ఓట్లను నమోదు చేయించిందంటూ మండిపడ్డారు.
గత నాలుగు సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రభుత్వం లేదు. మోదీ ప్రభుత్వం కొలువు తీరాక వివాదాస్పదమైన 370 ఆర్టికల్ ను తొలగించింది.
దీంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. జమ్మూ, కాశ్మీర్ లను వేర్వేరుగా చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదులు మరింత రెచ్చి పోవడం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్నికల్లో లబ్ది పొందేందుకు స్థానికేతరులను ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానికుల మద్దతు ఆ పార్టీకి లేదని పేర్కొంది.
కేంద్ర పాలిత ప్రాంతంలో బయటి వ్యక్తులతో సహా దాదాపు 25 లక్షల మంది ఓటర్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డిక్లేర్ చేశారు.
దీనిపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్ చేశాయి. తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇది పూర్తిగా పక్కా ప్లాన్ ప్రకారం బీజేపీ బయటి వ్యక్తులను ఓటర్లుగా నమోదు చేయించిందంటూ జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్ భల్లా(Raman Bhalla) ఆరోపించారు.
ముఖ్యంగా బయటి ఓటర్లను చేర్చుకునే అంశంపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ నివాసితులు లేదా బయటి వ్యక్తులు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారా అని ప్రశ్నించారు.
ఓటర్లుగా చేర్చుకునేందుకు ఓటర్ల నమోదు రూల్ ను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటూ నిలదీశారు.
Also Read : రేపిస్టుల విడుదల సిగ్గు చేటు – మహూవా