Ramanujacharya : స‌మ‌తామూర్తి తిరుమంత్రం జీవ‌న వేదం

భువిపై న‌డ‌యాడిన రామానుజుడికి వెయ్యేళ్లు

Ramanujacharya : భ‌గ‌వ‌త్ రామానుజాచార్యులు ఈ ప‌విత్ర భూమిపై జ‌న్మించి వెయ్యి సంవ‌త్స‌రాలు అవుతోంది. ఆయ‌నను ఇవాళ స్మ‌రించు కోవ‌డానికి కార‌ణం ఆనాటి స‌మాజాన్ని సంస్క‌రించాల‌ని అనుకున్నారు.

ఈ దేశంలో ఎంద‌రో మ‌హానుభావులు, రుషులు, యోగులు, స్వాములు, సంస్క‌ర్త‌లు తమ జీవితాల‌ను మాన‌వుల‌లో స‌మాన‌త్వ భావ‌న క‌లుగ చేసేందుకు, విలువ‌ల‌తో కూడిన జీవ‌న ప‌రామ‌ర్థాన్ని తెలియ చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

ఆధ్యాత్మిక భావ జ‌ల ధార‌ను ప్ర‌స‌రించేలా కృషి చేశారు. అదే క్ర‌మంలో వెయ్యి (1000) సంవ‌త్స‌రాల కింద‌ట రామానాజాచార్యులు (Ramanujacharya)జ‌న్మించారు. స‌మాజంలో నెల‌కొన్న అస‌మాన‌త‌ల‌ను గుర్తించి వాటిని రూపుమాపేందుకు ప్ర‌య‌త్నం చేశారు.

వందేళ్ల‌కు పైగా బ‌తికిన ఆయ‌న జీవిత‌మంతా స్ఫూర్తి దాయ‌కంగా ఉండేలా చేశారు. త‌రాలు మారినా టెక్నాల‌జీ అభివృద్ధి జ‌రిగినా నేటికీ ఇంకా కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, విభేదాల‌తో కొట్టుకు చ‌స్తున్నాం.

ఇలాంటి అస‌మాన‌త‌లే ఆనాటి కాలంలోనూ ఉన్నాయి. వాటిని శ్రీ రామానుజుల (Ramanujacharya)వారు గుర్తించి నిర‌సించారు. దైవం అన్న‌ది అంద‌రినీ స‌మానులేన‌ని న‌మ్ముతుంది.

ఈ నేల‌పై పుట్టిన ప్ర‌తి ప్రాణికి మ‌నుషులే కాదు స‌క‌ల జీవ‌రాశులు ఒక్క‌టేన‌ని , వారంద‌రికీ ఇక్క‌డ బ‌తికే అవ‌కాశం, హ‌క్కు ఉంద‌ని చాటారు. ఈ క్ర‌మంలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు రామానుజుడు.

అయినా ఎక్క‌డా ధైర్యం కోల్పోలేదు. కొంద‌రిని మాత్ర‌మే ఆల‌యాల్లోకి ప్ర‌వేశం క‌ల్పిస్తూ అంట‌రానివారుగా చూడ‌డాన్ని వ్య‌తిరేకించాడు. ఆనాటి స‌మాజంతో పోరాటం చేశాడు.

ఆద‌ర్శ ప్రాయంగా నిలిచాడు రామానుజాచార్యులు. అందుకే ఆయ‌న‌ను స్మ‌రించుకుంటూ రాబోయే త‌రాల‌కు స్ఫూర్తి దాయ‌కంగా ఉండేందుకు గాను శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి భారీ ఎత్తున స‌మాతామూర్తి పేరుతో 216 అడుగుల‌తో రామానుజుడి విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

Also Read : ప్రాతః స్మ‌ర‌ణీయుడు రామానుజుడు

Leave A Reply

Your Email Id will not be published!