Ramanujacharya : వెయ్యేళ్ల కిందట ఈ పవిత్ర భూమిపై జన్మించిన రామానాజాచార్యులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆధ్యాత్మిక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన ఆనాడే కుల, మతాలను, వర్గ విభేదాలను, మనుషలలో ఉన్న ఆధిపత్య ధోరణిని నిరసించారు.
రామానుజాచార్యుల్ని (Ramanujacharya )వేలాది మంది నిత్యం పూజిస్తారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. జీవితం అన్నది విలువైనదని, ప్రతి ఒక్కరిని ప్రేమించడం, పూజించడం కావాలని పిలుపునిచ్చిన మహనీయుడు రామానుజుడు.
మనుషులంతా ఒక్కటే సకల జీవ రాశులన్నీ సమానమేనని చాటాడు. అంతే కాదు ఆచరణలో చేసి చూపించాడు. కుల, మతాలను నిరసించాడు. మనుషులు ఉన్నది ప్రేమను పంచడానికి, ఒకరినొకరు ద్వేషించు కోవడానికి కాదని ఈ లోకానికి చాటాడు.
అందుకే శ్రీ రామానుజుల (Ramanujacharya )వారిని సమతామూర్తి అని పిలుచుకుంటారు. ఆ మహానుభావుడి జీవితం ఆదర్శ ప్రాయమని ఆయన జన్మించి వెయ్యేళ్లు అయినా నేటికీ ప్రాతః స్మరణీయుడిగానే ఉన్నారని అంటారు ఆధ్యాత్మికవేత్తలు.
రామానుజుడిని నిత్యం తలుచుకునేలా, ఆచరించేలా, కొలిచేలా, స్ఫూర్తి దాయకంగా ఉండేలా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ శ్రీరామనగరం ఆశ్రమంలో. ఇందు కోసం రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు.
నభూతో నభవిష్యత్ అన్న రీతిలో దీనిని తీర్చి దిద్దారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి ఈ మహోన్నత మానవుడికి సమాతా కేంద్రం అని పేరు పెట్టారు.
ఇప్పుడు ప్రపంచంలోనే రెండో విగ్రహంగా చరిత్రలో నిలిచి పోయింది. దీనికి తోడ్పడిన వారంతా ధన్యులేనని మంగళా శాసనాలు పలికారు చినజీయర్ స్వామి.
Also Read : అక్కడ బుద్దుడు ఇక్కడ రామానుజుడు