Ramdas Athawale : ప్ర‌భుత్వ ఏర్పాటుపై ఆలోచించ లేదు

కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే

Ramdas Athawale : మ‌హారాష్ట్ర సంక్షోభం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి రాందాస్ అథ‌వాలే(Ramdas Athawale) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసే ఆలోచ‌న చేయ‌డం లేద‌న్నారు. ఏం జ‌రుగుతుందో వేచి చూస్తామ‌ని చెప్పారు.

శ‌ర‌ద్ ప‌వార్ , అజిత్ ప‌వార్ , ఉద్ద‌వ్ థాక‌రే, సంజ‌య్ రౌత్ ఇప్ప‌టికే తాము మెజారిటీ నిరూపించు కుంటామ‌ని చెప్పార‌ని అందుకే వెయిట్ చేస్తున్నామ‌ని అన్నారు అథ‌వాలే.

చాలా మంది ఎమ్మెల్యేలు శివ‌సేన పార్టీని వీడారు. నాకు తెలిసి ప్ర‌స్తుతం ఉద్ద‌వ్ ఠాక్రే వెంట కేవ‌లం 7 లేదా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు స‌మాచారం ఉంది.

మ‌రి రెబ‌ల్స్ బ‌య‌ట ఉంటే వీరి వ‌ద్ద ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేల‌తో మెజారిటీ ఎలా నిరూపించుకుంటారో త‌న‌కు అర్థం కావ‌డం లేదంటూ రాందాస్ అథ‌వాలే ఎద్దేవా చేశారు.

తిరుగుబాటు ప్ర‌క‌టించిన ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలో 37 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌న్నారు. ఏం చూసుకుని ఇలా చెబుతున్నారో తెలియ‌డం లేద‌న్నారు అథ‌వాలే(Ramdas Athawale).

తాజాగా మ‌హారాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ , మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తో మాట్లాడాను. శివ‌సేన పార్టీ అంత‌ర్గత విభేదాల‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని చెప్పార‌ని తెలిపారు.

ఏది ఏమైనా ఈ సంక్షోభానికి ముగింపు ప‌ల‌కాల‌ని భావిస్తున్నామ‌ని పేర్కొన్నారు మంత్రి. ఇదే స‌మ‌యంలో ఒక వేళ ఆయా పార్టీలు త‌మ బ‌లాన్ని నిరూపించు కోలేక పోతే అత్య‌ధిక బ‌లం క‌లిగిన త‌మ పార్టీ రెడీగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Also Read : శివ‌సేన అంతానికి ఎన్సీపీ కుట్ర – షిండే

Leave A Reply

Your Email Id will not be published!