Ramdas Athawale : ఉద్ద‌వ్ ఠాక్రే క‌థ‌ ముగిసింది – అథవాలే

షిండేతో క‌లిసి బీజేపీ ప్ర‌భుత్వం ఏర్పాటు

Ramdas Athawale : రిప‌బ్లిక‌న్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ , కేంద్ర మంత్రి డాక్ట‌ర్ రాందాస్ అథ‌వాలే(Ramdas Athawale) షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకున్న రాజ‌కీయ సంక్షోభం, త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌పై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

శుక్ర‌వారం ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడారు. మ‌హా వికాస్ అఘాడీ ప‌ని అయి పోయింద‌న్నారు. ఇక సీఎంగా ఉద్ద‌వ్ ఠాక్రే స‌మ‌యం ముగిసింద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎక్కువ మంది శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రి ఏక్ నాథ్ షిండే వైపు ఉన్నార‌ని చెప్పారు. ఈ మేర‌కు షిండే భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నార‌ని జోస్యం చెప్పారు.

ఇందులో ఎలాంటి అనుమానం ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొన్నారు. ఎవ‌రు ఏమిట‌నేది ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఎవ‌రి వైపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే వారిదే ఆ పార్టీ అవుతుంద‌న్నారు.

మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకున్న ఈ త‌తంగం కొద్ది రోజుల్లో ముగుస్తుంద‌న్నారు. అంతా సాఫీగా సాగుతుంద‌ని పేర్కొన్నారు రాందాస్ అథ‌వాలే(Ramdas Athawale). ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్, శివ‌సేన‌, ఎన్సీపీ లు క‌లిసి మ‌హా వికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి.

రెండున్నర ఏళ్ల పాటు ఈ ప్ర‌భుత్వం కొన‌సాగింది. అంత‌లోనే శివ‌సేన పార్టీకి చెందిన నాయ‌కుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే నుంచి ముప్పు పొంచి ఉంద‌ని సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే గుర్తించ లేక పోయారు.

ఆయ‌న రెబ‌ల్ ఎమ్మెల్యేల‌తో క‌లిసి ధిక్కార స్వ‌రం వినిపిస్తున్నారు. ప్ర‌స్తుతం అస్సాంలోని గౌహ‌తిలో రాడిస‌న్ బ్లూ హోట‌ల్ లో మ‌కాం వేశారు. ప్ర‌స్తుతం చ‌ద‌రంగం ఆడుతున్నారు.

Also Read : స‌మ‌గ్ర‌త ముఖ్యం సార్వ‌భౌమ‌త్వం అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!