Karnataka CM : సీఎం ఎంపికపై సూర్జేవాలా కామెంట్స్
ఇంకా ఖరారు కాలేదని ప్రకటన
Karnataka CM : కర్ణాటకలో రాజకీయం మరింత వేడిని రాజేసింది. నువ్వా నేనా అన్న రీతిలో అంతర్గతంగా కాంగ్రెస్ లో పోరు కొనసాగుతోంది. సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై ఇవాల్టి దాకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఈ తరుణంలో ఏఐసీసీకి సంబంధించి కీలక ప్రకటన ఇంకా ఖరారు చేయలేదు. సీఎంగా దాదాపు మాజీ సీఎం సిద్దరామయ్య పేరు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ మేరకు సిద్దరామయ్య అనుచరులు పెద్ద ఎత్తున సంబురాల్లో మునిగి పోయారు. మరో వైపు సీఎం రేసులో చివరి దాకా నిలిచిన కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ మద్దతుదారుల్లో నైరాశ్యం అలుముకుంది.
సీఎం ఎంపిక వ్యవహారం 138 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఛాలెంజ్ గా మారింది. ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎవరిని నియమించాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. ఇదిలా ఉండగా చివరకు ఖర్గే తానేమీ చేయలేనంటూ చేతులెత్తేశారు. ఆపై ఎంపిక నిర్ణయాన్ని రాహుల్ గాంధీకే వదిలి వేశారు.
డీకే శివకుమార్ తనకు ఆత్మీయుడైనప్పటికీ సిద్దరామయ్య వైపు మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సిద్దరామయ్య మరోసారి తన కెరీర్ లో సీఎం కానున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ రణ్ దీప్ సూర్జేవాలా సంచలన ప్రకటన చేశారు. సీఎం ఎంపిక ఇంకా ఖరారు కాలేదన్నారు.
Also Read : Nitish Kumar Pitched