Randeep Surjewala : ఆంగ్లేయుల్ని తలపిస్తున్న బీజేపీ పాలన
కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఫైర్
Randeep Surjewala : ఆనాటి ఆంగ్లేయుల పాలనను కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ తలపింప చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించారు పార్టీ సీనియర్ నాయకుడు రణ్ దీప్ సూర్జేవాలా(Randeep Surjewala).
అధికారం ఉంది కదా అని రెచ్చి పోతే రాబోయే రోజుల్లో తగిన గుణ పాఠం చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు నమోదు చేయడం, కేంద్ర దర్యాప్తు సంస్థలను వేధింపులకు గురి చేసేలా ఉపయోగించడం మోదీ ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిందని ఆరోపించారు.
మిమ్మల్ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఉందన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసుకు సంబంధించి నమోదు చేసిన కేసు పూర్తిగా నిరాధారమైనదని ఆరోపించారు సూర్జేవాలా.
ఇప్పటికే కేసు కొట్టి వేశారని కానీ ఇబ్బందులకు గురి చేసేందుకే కావాలని తిరిగి అక్రమ, నిరాధారమైన కేసు నమోదు చేశారని ఆరోపించారు. అయినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.
ఇవాళ బేషరతుగా మా అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వెళతారు. ఇదే సమయంలో తమ పార్టీకి నిరసన తెలిపే హక్కు ఉందని మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
రాజకీయంగా లబ్ది పొందేందుకే ఇలా కేంద్రం నాటకాలు ఆడుతోందంటూ ఆరోపించారు రణ్ దీప్ సూర్జేవాలా(Randeep Surjewala). తాము శాంతియుతంగా పోరాటం చేస్తామని చెప్పారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
సత్యం ఎప్పటికీ నిలిచే ఉంటుందని, దానిని ఏ సర్కార్ తుడిచి వేయలేదన్నారు సూర్జేవాలా.
Also Read : నూపుర్ శర్మకు గౌతం గంభీర్ సపోర్ట్