Randeep Surjewala : మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలపై అనుసరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. లాభాల బాటలో పయనిస్తూ, కొన్నేళ్ల నుంచి పాలసీదారులకు ఎనలేని సేవలు అందిస్తున్న జీవిత బీమా సంస్థను ఐపీఓకు ఇవ్వడం దారుణమని పేర్కొంది.
ఈ సందర్భంగా కేంద్ర సర్కార్ కు నాలుగు ప్రశ్నలు సంధించింది. ప్రధానంగా దేశీయ సంస్థల నేతృత్వంలోని పెట్టుబడిదారుల నుంచి రూ. 5, 627 కోట్లకు పైగా సేకరించింది.
మార్కెట్ లో అంచనా కంటే తక్కువ వాల్యూ నిర్దేశించడంపై మండిపడింది కాంగ్రెస్ పార్టీ. 8 నుంచి 10 లక్షల కోట్ల అంచనా విలువతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా అతి పెద్ద దేశీయ కంపెనీలలో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది.
మెగా ఎల్ఐసీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ లిస్టింగ్ కు ఒక రోజు ముందు 30 కోట్ల మంది పాలసీ హోల్డర్ల విశ్వాసంపై కేంద్ర ప్రభుత్వం దెబ్బ కొట్టింది.
మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని, పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
భారతదేశంలో ఆస్తులను గంపగుత్తగా అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. 30 కోట్ల మంది పాలసీదారుల నమ్మకాన్ని మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ ధ్వజమెత్తారు.
ఫిబ్రవరి 2022లో రూ. 12-14 లక్షల కోట్ల ఎల్ఐసీ విలువను రూపాయికి ఎందుకు తగ్గించారంటూ సూర్జేవాలా (Randeep Surjewala)ప్రశ్నించారు. ఒక్కో షేరుకు రూ. 1,100 నుంచి రూ. 902 కి ఎందుకు తగ్గించారని నిలదీశారు.
Also Read : జోధ్ పూర్ ఘటన దురదృష్టకరం – సీఎం