Randeep Surjewala : యెస్ బ్యాంక్ స్కాం కేసులో ప్రధాన నిందితుడైన కో ఫౌండర్ రాణా కపూర్ (Randeep Surjewala )ఉన్నట్టుండి బాంబు పేల్చాడు. తనను ఎం.ఎఫ్. హుస్సేన్ వేసిన పెయింటింగ్ ను కొనాలంటూ ప్రియాంకా గాంధీ వాద్రా వత్తిడి తెచ్చారంటూ ఆరోపించారు.
అంతే కాదు అలా చేయక పోతే పద్మభూషణ్ రాకుండా అడ్డుకుంటామంటూ అప్పటి పెట్రోలియం మంత్రి మురళీ దేవరా హెచ్చరించారంటూ ఈడీకి ఇచ్చిన విచారణలో తెలిపాడు.
ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ కు ఇది ఒక రకంగా షాక్ అని చెప్పక తప్పదు. సజీవంగా లేని వ్యక్తులపై ఆరోపణలు చేస్తూ తెలివిగా బురద చల్లేందుకు యత్నించారంటూ కాంగ్రెస్ రాణా కపూర్ పై మండి పడింది.
దివంగత మురళీ దేవరా , అహ్మద్ పటేల్ పై రాణా కపూర్ (Randeep Surjewala )సంచలన ఆరోపణలు చేశారు.. తాను ఆ పెయింటింగ్ ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేశానని, ఆ మొత్తాన్ని సోనియా గాంధీ చికిత్స కోసం వినియోగించారంటూ ఆరోపించాడు రాణా కపూర్.
తనకు పద్మ భూషణ్ రాదని చెప్పడంతో భయపడ్డానని అందుకు ఒప్పుకున్నానని తెలిపాడు. రూ. 5 వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఇలా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఆయన ఈ లోకంలో లేని వ్యక్తుల గురించి ఆరోపణలు చేశాడని తెలిపారు. పెయింటింగ్ కోసం తాను రూ. 2 కోట్లు చెల్లించానని మురళీ దేవరా కుమారుడు మిలింద్ దేవరా గాంధీ చికిత్స కోసం ఖర్చు చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
సోనియా గాంధీకి సన్నిహితుడైన అహ్మద్ పటేల్ తనతో కూడా చెప్పాడని రాణా కపూర్ తెలిపాడు. విచిత్రం ఏమిటంటే మురళీ దేవరా కానీ అహ్మద్ పటేల్ కానీ ఇప్పుడు జీవించి లేరు.
దీనిని పూర్తిగా ఖండించారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా.
Also Read : జహంగీర్ పూరి ఘటనపై ఆస్థానా ఆరా