Rani Rudrama Reddy : వేణు ఆశీర్వాదం రాణి సంతోషం
సిరిసిల్ల బీజేపీ అభ్యర్థిగా ఎంపిక
Rani Rudrama Reddy : హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణలో 119 సీట్లకు గాను 52 సీట్లను తొలి విడత జాబితాను ప్రకటించింది. ఇందులో భాగంగా కీలకమైన సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి పార్టీ పరంగా ఉద్యమకారిణిగా గుర్తింపు పొందిన రాణి రుద్రమ రెడ్డికి కేటాయించింది.
Rani Rudrama Reddy Meet Venu Swami
ఇక్కడ పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాణి రుద్రమ రెడ్డికి టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. బీజేపీ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఇదిలా ఉండగా తనకు ఊహించని రీతిలో సిరిసిల్ల టికెట్ ను కేటాయించడంతో సంతోషానికి గురయ్యారు. గతంలో ఎన్నో ఏళ్లుగా బీజేపీ కోసం పని చేస్తూ వచ్చారు లగిశెట్టి శ్రీనివాస్.
ఇదిలా ఉండగా రాణి రుద్రమ రెడ్డి(Rani Rudrama Reddy) ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామిని కలుసుకున్నారు. తనకు టికెట్ వచ్చిన సందర్బాన్ని పురస్కరించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. తప్పకుండా గెలవాలని ఆకాంక్షించారు వేణు స్వామి.
ప్రస్తుతం సిరిసిల్లకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ , కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరిన కల్వకుంట్ల తారక రామారావు. ఆయనను ఢీకొనే సత్తా రాణి రుద్రమ రెడ్డికి ఉందా అనే అనుమానం నెలకొంది.
Also Read : Revanth Reddy : మేడిగడ్డ మేడిపండు – రేవంత్