Ranil Wickramasinghe : తగులబెట్టి ఇంటికి వెళ్లమంటే ఎలా
నిరసనకారులకు శ్రీలంక అధ్యక్షుడు ప్రశ్న
Ranil Wickramasinghe : శ్రీలంక సంక్షోభ సమయంలో దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన రణిలె విక్రమసింఘే సంచలన కామెంట్స్ చేశాడు. తనను రాజీనామా చేయమంటున్నారు.
ఆపై ఇంటికి వెళ్లమంటున్నారు మీరంతా. ఉన్న నా ఇల్లును తగుల బెట్టారు. ఇంక నేను ఎక్కడికి వెళ్లను. నాకు ఉండేందుకు ఇల్లు లేదు. చూపిస్తే వెళ్లేందుకు సిద్దమని ఆందోళనకారులు, నిరసనకారులకు స్పష్టం చేశారు విక్రమసింఘే(Ranil Wickramasinghe).
మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే రాజభవనం ముట్టడించారు. ఆ సమయంలో దేశం విడిచి పారి పోయాడు. మొదట మాల్దీవులకు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రాణ భయంతో సింగపూర్ లో తలదాచుకున్నాడు.
తన సోదరుడు మహీంద రాజపక్సే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. నేవీ, ఆర్మీ క్యాంపులో తలదాచుకున్నాడు. ఈ సమయంలో పీఎంగా ఉన్న రణిలె విక్రమసింఘే తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు.
ఇదే సమయంలో రణిలె ఇంటిని ముట్టడించారు ఆందోళనకారులు. దగ్ధం చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సమయంలో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది.
నిరసనకారులు మాత్రం గోటబయ వారసుడే ఈ రణిలె విక్రమసింఘే అంటూ ఆరోపణలు చేశారు. వెంటనే ప్రెసిడెంట్ పదవి నుంచి దిగి పోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయన దిగి పోయేంత దాకా ఉద్యమం ఆగదని హెచ్చరిస్తున్నారు.
నిరసనకారుల నుండి వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు ప్రెసిడెంట్. వెళ్లేందుకు ఇల్లు లేనందు వల్ల ఇంటికి వెళ్లండంటూ డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు.
శ్రీలంక లోని కాండీ నగరంలో మీడియాతో మాట్లాడారు రణిలె విక్రమసింఘె(Ranile Wikramasinghe). దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు.
ఈ సమయంలో నిరసనల కంటే సంయమనం పాటించాలని కోరారు.
Also Read : శ్రీలంక సంక్షోభం భారత్ కు గుణపాఠం