Rapolu Ananda Bhaskar : బీజేపీకి గుడ్ బై ‘గులాబీ’కి రాపోలు జై
గులాబీ పార్టీలో చేరిక
Rapolu Ananda Bhaskar : తెలంగాణలో రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. విమర్శల పర్వం, ఆపరేషన్ ఆకర్ష్ లు జోరందుకున్నాయి. ఒకరిపై మరొకరు తూటాలు పేల్చుతున్నారు. ఇదే సమయంలో జంపింగ్ జిలానీలు ఎక్కువయ్యారు. నిన్నటి దాకా ఒక పార్టీతో ఉన్న వారు రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇదంతా మునుగోడులో చోటు చేసుకున్న ఉప ఎన్నిక ప్రభావం కావచ్చు. తాజాగా మరో వికెట్ పడింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి బిగ్ షాక్. ఇప్పటికే తెలంగాణ మేధావిగా పేరొందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరిన కొద్ది రోజులకే గుడ్ బై చెప్పారు. ఆయనతో పాటు మాజీ స్పీకర్ , ఉద్యమ నాయకుడుగా పేరొందిన స్వామి గౌడ్ కేటీఆర్ సమక్షంలో తిరిగి గులాబీ గూటికి చేరారు.
తాజాగా ఇదే బీజేపీకి చెందిన మరో సీనియర్ నాయకుడు రాపోలు ఆనంద్ బాస్కర్(Rapolu Ananda Bhaskar) తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డాకు పంపించారు. పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఏనాడూ తనను పట్టించు కోలేదంటూ వాపోయారు.
ఇదిలా ఉండగా రాపోలు ఆనంద భాస్కర్ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అంతకు ముందు జర్నలిస్ట్ గా పేరొందారు. తనను ఎన్నోసార్లు అవమానాలకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే రాపోలు సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఆయన కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. రాపోలుకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు.
Also Read : కొత్త నాటకానికి తెర లేపిన సీఎం – బండి
