While We Watched : 21న న్యూయార్క్ లో ‘రవీష్’ ఫిల్మ్
వైల్ వీ వీచ్డ్ డాక్యుమెంటరీ
While We Watched : భారత దేశం గర్వించ దగిన జర్నలిస్టులలో రవీష్ కుమార్ ఒకరు. మోదీకి వ్యతిరేకంగా ఆయన తన గొంతు విప్పుతున్నారు. ఆయనపై తీసిన వైల్ వీ వాచ్ డ్ డాక్యుమెంటరీ(While We Watched) ఫిల్మ్ ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆపై అవార్డులు, పురస్కారాలు లభించాయి. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. అదేమిటంటే జూలై 21న ఐఎఫ్‌సీ సెంటర్ లోని థియేటర్లలో దీనిని విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు.
ఇది నమ్మశక్యం కాని విషయంగా పేర్కొన్నారు. చాలా నిద్రలేని రాత్రుళ్లు గడిపామని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా రవీష్ కుమార్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఎన్డీటీవీ నుంచి వైదొలిగాక స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. ప్రజా సమస్యలను వినిపిస్తున్నారు. మోదీనీ, బీజేపీ సర్కార్ ను, అది చేసే ఆగడాలను నిలదీస్తున్నారు.
ఇదిలా ఉండగా రవీష్ కుమార్ కు మెగసెసె అవార్డు అందుకున్నారు. ఆయన వృత్తి పరమైన ప్రయాణంపై చిత్ర నిర్మాత వినయ్ శుక్లా 94 నిమిషాల నిడివి కలిగిన హిందీ డాక్యుటమెంటరీ వైల్ వీ వీచ్డ్ పేరుతో తీశారు. ఇది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో యాంప్లిఫై వాయిస్ అవార్డును గెలుచుకుంది. వాస్తవాలను, సత్యాలను బయటకు చెప్పేందుకు ప్రయత్నం చేశారు. నాణ్యమైన జర్నలిజం చని పోతే ప్రపంచానికి చాలా నష్టమన్నారు చిత్ర దర్శకుడు, నిర్మాత శుక్లా.
Also Read : Priyanka Gandhi : నర్మదా పూజలో పాల్గొన్న ప్రియాంక