Ravi Shankar Prasad Rahul : దేశంలో డెమోక్రసీకి ఢోకా లేదు
రాహుల్ దేశానికి వ్యతిరేకం
Ravi Shankar Prasad Rahul : భారత దేశంలో డెమోక్రసీ ప్రమాదంలో పడిందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ నిప్పులు చెరిగింది. దేశం పట్ల ఎలాంటి అవగాహన లేకుండానే అవాకులు చెవాకులు పేలుతున్నారంటూ మండిపడింది. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని, వాటికి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
యావత్ ప్రపంచం భారత దేశ ప్రధానమంత్రిని, ఆయన నాయకత్వాన్ని ప్రశంసిస్తోందని తెలిపింది. ఈ సమయంలో మోదీకి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఇలా రాహుల్ గాంధీ చవకబారు విమర్శలకు దిగుతున్నారంటూ ఎద్దేవా చేసింది. దేశంలో డెమోక్రసీకి వచ్చిన నష్టం ఏమీ లేదని పేర్కొంది. ఈ దేశంలో ప్రజాస్వామం బతికి ఉన్నందుకే రాహుల్ గాంధీ భారత జోడో యాత్ర చేయగలిగారని ఆ విషయం ఆయన మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది.
పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని పేర్కొంది. విదేశాలలో భారత దేశం గురించి చులకనగా మాట్లాడటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. ఆయన తన స్థాయికి దిగజారి ప్రవర్తించారంటూ మండిపడింది.
రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భారత దేశ ప్రజాస్వామ్యం , రాజకీయాలు, పార్లమెంట్ , రాజకీయ వ్యవస్థ , న్యాయ వ్యవస్థను అవమాన పరిచేలా చేశారంటూ బీజేపీ అధికార ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad Rahul) ఆరోపించారు. రాహుల్ గాంధీ తాను చేసిన కామెంట్స్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : మోదీపై భగ్గుమన్న కేజ్రీవాల్