Ravi Shankar Prasad Rahul : రాహుల్ క్ష‌మాప‌ణ చెబుతారా

నోట్ల ర‌ద్దు సుప్రీం తీర్పుపై బీజేపీ

Ravi Shankar Prasad Rahul : గ‌త కొంత కాలంగా నోట్ల ర‌ద్దు విష‌యంలో కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిప్పులు చెరుగుతూ వ‌స్తున్నారు. నోట్ల ర‌ద్దు కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు తీర‌ని న‌ష్టం ఏర్ప‌డింద‌ని, బ‌డా బాబులు, కార్పొరేట్లు బాగు ప‌డ్డార‌ని ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా సోమ‌వారం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది.

మొత్తం 58 పిటీష‌న్లు దాఖ‌ల‌య్యాయి. కేంద్ర స‌ర్కార్ నోట్ల ర‌ద్దు ను స‌వాల్ చేస్తూ. ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఇవాళ కీల‌క తీర్పు వెలువ‌రించింది. అయితే ఇక్క‌డ కీల‌క తీర్పు వెలువ‌రించినా ఐదుగురు న్యాయ‌మూర్తుల‌లో న‌లుగురు మాత్రం మోదీ బీజేపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించారు.

ఒక ర‌కంగా మ‌ద్ద‌తు ప‌లికారు. కానీ ఇదే ధ‌ర్మాస‌నంలో ఉన్న మ‌రో సీనియ‌ర్ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి బీవీ నాగ‌రత్న మాత్రం తీవ్రంగా విభేదించారు. అంతే కాదు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నోట్ల ర‌ద్దు పూర్తిగా చ‌ట్ట విరుద్ద‌మ‌ని , దానిని తాను స‌మ‌ర్థించ‌డం లేద‌ని, ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆమె పూర్తిగా విభేదించారు. దీంతో ఐదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నంలో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం క‌ల‌క‌లం రేపింది. అయినా వీరిలో న‌లుగురు మొగ్గు చూప‌డంతో మోదీ స‌ర్కార్ కు ఒకింత బ‌లాన్ని ఇచ్చిన‌ట్ల‌యింది. కాగా సోమ‌వారం భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నేత(Ravi Shankar Prasad) ర‌వి శంక‌ర్ ప్ర‌సాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఇక‌నైనా రాహుల్ గాంధీ క్ష‌మాప‌ణ చెబుతారా అని ప్ర‌శ్నించారు.

Also Read : నోట్ల ర‌ద్దు చ‌ట్ట విరుద్దం – నాగ‌రత్న

Leave A Reply

Your Email Id will not be published!