RBI Hikes Repo Rate : రెపో రేటు పెంచిన ఆర్బీఐ

35 బేసిస్ పాయింట్లు పెంపు

RBI Hikes Repo Rate : అంతా అనుకున్న‌ట్టుగా దేశ ఆర్థిక రంగాన్ని శాసిస్తూ వ‌స్తున్న రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ‌రోసారి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ మేర‌కు అంతా అనుకున్న‌ట్టుగానే మార్కెట్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రెపో రేటు(RBI Hikes Repo Rate)  పెంచింది. దీని వ‌ల్ల సామాన్యుల‌కు ఇబ్బందులు త‌ప్ప ఒరిగేది ఏమీ ఉండ‌దు.

ఈ మేర‌కు బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది ఆర్బీఐ. వ‌డ్డీ రేట్ల‌ను భారీగా పెంచింది. దీని వ‌ల్ల సామాన్యుల్లో కొనుగోలు శ‌క్తి పూర్తిగా న‌శిస్తుంది. ఈ రెపో రేటు ప్ర‌భావం దేశ ఆర్థిక రంగంపై పెను ప్ర‌భావం చూప‌నుంది. ఇదిలా ఉండ‌గా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్.

దీంతో తాజాగా పెంచ‌డంతో రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. కాగా ఈ ఒక్క సంవ‌త్స‌రంలో ఆర్బీఐ వ‌రుస‌గా రెపో రేటును పెంచ‌డం ఐదోసారి కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా పెంచుతూ పోతే ఎవ‌రికి లాభమో గ‌వ‌ర్న‌ర్ చెప్పాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల మార్కెట్ పై ప్ర‌భావం ప‌డుతుంది.

ఆపై బ‌డా బాబుల‌కు, వ్యాపార‌వేత్త‌ల‌కు లాభం చేకూరుతుందే త‌ప్పా ఏమీ ఉండ‌దు. అయితే రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం ద్ర‌వ్యోల్బ‌ణం క‌ట్ట‌డి చేసేందుకు, ఆర్థిక వృద్ది మ‌రింత కొన‌సాగేందుకు గాను వ‌డ్డీ రేట్ల‌ను పెంచాల్సి వ‌చ్చింద‌ని క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్. ర‌ష్యా, ఉక్రెయిన్ యుద్దం అనంత‌రం ప్ర‌పంచ వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగింద‌ని అన్నారు.

Also Read : మారిన స్వ‌రం కొత్త వారికి అవ‌కాశం – పీఎం

Leave A Reply

Your Email Id will not be published!