RBI RS 2000 Notes : 76 శాతం రూ. 2000 నోట్లు వెనక్కి
స్పష్టం చేసిన రిజర్వ్ బ్యాంక్
RBI RS 2000 Notes : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే కేంద్రం రూ. 2,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో దేశంలో చెలామణిలో ఉన్న నోట్లు ప్రకటించిన డెడ్ లైన్ తర్వాత రద్దవుతాయని, వెంటనే ఆయా ప్రభుత్వ , ప్రైవేట్ రంగ బ్యాంకులలో జమ చేయాలని స్పష్టం చేసింది ఆర్బీఐ(RBI). దీంతో దేశ వ్యాప్తంగా నిల్వ ఉన్న రూ. 2,000 నోట్లన్నీ దాదాపు 76 శాతం ఆయా బ్యాంకులకు తిరిగి వచ్చాయని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం కీలక ప్రకటన చేసింది దేశంలోని అత్యున్నత ఆర్థిక నియంత్రణ సంస్థ ఆర్బీఐ.
ఇదిలా ఉండగా గత మే నెల 19న చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లను ఉప సంహరించు కుంటున్నట్లు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ కీలక ప్రకటన చేసింది. కరెన్సీ నోట్లను ఆయా బ్యాంకులలో జమ చేసేందుకు లేదా మార్చుకునేందుకు వీలు కల్పిస్తూ వెసులుబాటు కల్పించింది.
చెలామణిలో ఉన్న నోట్లలో దాదాపు 75 శాతానికి పైగా వచ్చినట్లు తెలిపింది. మొత్తం డబ్బులలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. మిగిలిన రూ. 2000 నోట్లకు సంబంధించి 13 శాతం మార్పిడి జరిగిందని పేర్కొంది. ఇక నోట్ల విలువ పరంగా చూస్తే జూన్ 30 ఈ ఏడాది వరకు రూ. 2.72 లక్షల కోట్లు అని తెలిపింది ఆర్బీఐ.
Also Read : NCP Crisis : అజిత్ కు 24 మంది ఎమ్మెల్యేల మద్దతు
