RCP Singh : నితీశ్ కుమార్ జ‌న్మ‌లో ప్ర‌ధాని కాలేరు

నిప్పులు చెరిగిన ఆర్సీపీ సింగ్

RCP Singh : జేడీయూ సీనియ‌ర్ , బ‌హిష్కృత నాయ‌కుడు ఆర్సీపీ సింగ్ కీల‌క కామెంట్స్ చేశారు. న‌మ్మిన వారిని, న‌మ్ముకున్న వారిని మోసం చేయ‌డంలో నితీశ్ కుమార్ సిద్ద‌హ‌స్తుడ‌ని ఆరోపించారు.

17 ఏళ్ల పాటు కొన‌సాగుతూ వ‌చ్చిన బీజేపీతో బంధాన్ని ఎందుకు తెంచు కోవాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌న‌కు అన్ని పార్టీలు సాద‌ర స్వాగ‌తం ప‌లుకుతున్నాయ‌ని చెప్పారు.

తాను ఎవ‌రినీ ప‌ద‌వి కావాల‌ని కోరుకోలేద‌న్నారు. తాను పార్టీ బ‌లోపేతం కోసం కృషి చేశానే త‌ప్పా పార్టీకి వెన్నుపోటు పొడవ‌లేద‌న్నారు. బీజేపీలో చేర‌డంతో పాటు అన్ని ఆప్ష‌న్లు ఓపెన్ గా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

2020లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆదేశాల మేర‌కు జేడ‌యూ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించార‌నే ఆరోప‌ణ‌ల‌ను తీవ్రంగా ఖండించారు.

నితీశ్ కుమార్ ఎన్నిసార్లు ట్రై చేసినా దేశానికి ప్ర‌ధాన మంత్రి కాలేర‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న క‌ల‌లు కంటున్నార‌ని కానీ అవి ఇప్ప‌ట్లో నెర‌వేర‌వ‌న్నారు.

బీజేపీలో చేరుతారా అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న ఎందుకు కాకూడ‌దు అని ప్ర‌శ్నించారు. ఒక‌ప్పుడు బ్యూరోక్రాట్ గా ఉన్నారు. ఆ త‌ర్వాత రాజ‌కీయ నాయ‌కుడిగా మారారు.

జేడీయూ ఆర్సీపీ సింగ్(RCP Singh) రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలాన్ని తిర‌స్క‌రించింది. దీంతో త‌న మంత్రి ప‌ద‌విని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా సింగ్ కాషాయ శిబిరానికి న‌మ్మ‌క‌స్తుడిగా మారార‌ని ఆరోపించారు నితీశ్ కుమార్.

చంద్ర శేఖ‌ర్ , దేవెగౌడ‌, ఐకే గుజ్రాల్ , త‌దిత‌రులు ప్ర‌ధానులుగా కావ‌చ్చు. కానీ ఆనాడు అస్థిర కాలం లో కాగ‌లిగారు. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు ఆర్సీపీ సింగ్.

Also Read : నితీశ్ ఎప్పుడు వ‌దిలేస్తాడో చెప్ప‌లేం

Leave A Reply

Your Email Id will not be published!