Imran Khan : జైల్ భరో ఉద్యమానికి రెడీ – ఇమ్రాన్ ఖాన్
ప్రకటించిన పీటీఐ అధ్యక్షుడు
Imran Khan : తనను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ మేరకు దేశ వ్యాప్తంగా జైల్ భరో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయనకు ప్రాణ ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
అయినా పాకిస్తాన్ మాజీ పీఎం ఎక్కడా తగ్గడం లేదు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలు చేపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తనను ఎలా దించారో జనానికి తెలియ చేస్తున్నారు. ఆజాదీ మార్చ్ కు ముందు తన పార్టీ నిరసన కోసం ప్రభుత్వం కంటే మెరుగైన ప్లాన్ తో ఉన్నామని చెప్పారు.
ఆదివారం ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ను అరెస్ట్ చేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకుంది. దీంతో ముందే విషయం గ్రహించిన ఖాన్ ఏకంగా జైలు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పాలక సంకీర్ణానికి వ్యతిరేకంగా ఆయన గళం విప్పనున్నారు.
దేశం కోసం , నిజమైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు పీటీఐ చీఫ్, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్. మిలియన్ల కొద్దీ ప్రజలను జైలులో నిర్బంధించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందంటూ హెచ్చరించారు.
మీరంతా అరెస్ట్ అయ్యేందుకు సిద్దంగా ఉండండి అని కానీ తాము ఎట్టి పరిస్థితుల్లో భయపడ బోమంటూ స్పష్టం చేశారు ఇమ్రాన్ ఖాన్.
Also Read : మంత్రి సురేష్ కు అరుదైన గుర్తింపు