Ghulam Nabi Azad : యుద్దానికి సిద్ధం చావుకు భయపడను
అజిత్ దోవల్ ను ఎన్నడూ కలవ లేదు
Ghulam Nabi Azad : కేంద్ర మాజీ మంత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదన్నారు.
చంపుతానంటే తాను భయపడతానని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు గులాం నబీ ఆజాద్.
ఆపై బహిరంగ సభలు, ర్యాలీలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉండగా తాను బీజేపీకి బి టీంగా పని చేస్తున్నానంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వారు భ్రమల్లో ఉన్నారని, తనకు ఇంకొకరిపై ఆధారపడే నేపథ్యం కాదన్నారు.
తాను చిన్నతనం నుంచే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యానని, ఎప్పుడు ఏం చేయాలో, ఎవరితో ఎలా ఉండాలో తనకు బాగా తెలుసన్నారు.
తాను మాయ మాటలు చెప్పి ఓట్లు అడగడం లేదన్నారు. వాస్తవానికి మూడొంతులలో బిగ్ మెజారిటీ లేకుండా ఆర్టికల్ 370ని తిరిగి పునరద్దరించడం సాధ్యం కాదన్నారు.
ఒకవేళ అది సాధ్యమని చెప్పే వారు లేదా ఏ పార్టీకి చెందిన వారైనా తన ముందుకు రావాలని సవాల్ విసిరారు. వస్తే తాను చేసిన కామెంట్స్ కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్(Ghulam Nabi Azad) .
కొందరు తాను భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ను కలిశానని అంటున్నారని తాను ఇప్పటి వరకు ఆయనతో కలవలేదని, ఫోన్ లో కూడా మాట్లాడ లేదని చెప్పారు.
అయితే కొందరు తనను చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని తన 50 ఏళ్ల రాజకీయంలో ఎన్నో చూశానని చెప్పారు గులాం నబీ ఆజాద్.
Also Read : ఆజాద్ కు ఉగ్రవాద సంస్థ వార్నింగ్