#HyderabadRealEstate : హైదరాబాద్ లో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్
కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు నిర్మాణాలు
Hyderabad Real Estate : కోరనా వ్యాధి అతలాకుతలం చేసినా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు మెల మెల్లగా గాడిన పడుతున్నాయి. ఇపుడిపుడే జనం జాగ్రత్తలు పాటిస్తున్నారు. పనులకు వెళుతున్నారు. హైదరాబాద్ లో తక్కువ ధరకే ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాల కోసం ప్రస్తుతం వినియోగదారులు కోరుతున్నారు. వారి అభిరుచులకు తగ్గట్టు రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్మాణాలు చేపడుతున్నాయి. ఎప్పటి లాగే హైదరాబాద్ అంటేనే ఐటీ కారిడార్ గుర్తుకు వస్తుంది. దాని చుట్టూనే రియల్ ఎస్టేట్ పరుచుకుని ఉంది.
ఐటీ కేంద్రంగా ఉన్న హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కోకాపేట వరకు ఎకరం భూమి ధర కోట్లాది రూపాయలను దాటేసింది. మెరుగైన రవాణా, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో..కంపెనీలన్నీ అటు వైపు మొగ్గు చూపాయి. ఈ క్రమంలోనే ఐటీ కారిడార్ కు దగ్గరగా, ఓఆర్ఆర్ ఆనుకుని ఉండటంతో, సౌత్ సిటీలోనూ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ మొత్తం ఆకాశ హర్మ్యాలతో నిండి పోయింది.
ఇక సిటీ అవుట్ స్కర్ట్స్ కు భారీగా గిరాకీ ఏర్పడింది. రెసిడెన్షియల్, కమర్షియల్ సెగ్మెంట్లలో నిర్మాణ రంగానికి ఊపు వచ్చింది. రాజేంద్రనగర్, మలక్ పేట్, సంతోష్ నగర్, చాంద్రయాణ గుట్ట, ఫలక్ నుమా, రాజేంద్ర నగర్ సర్కిళ్లు ఇప్పుడు హాట్ గా మారాయి. ఇందులో అత్తాపూర్, మైలార్ దేవ్ పల్లి, కిషన్ బాగ్, నవాబ్ కుర్దు, సంతోష్ నగర్, లలిత్ భాగ్, ఉప్పుగూడ వంటి ప్రాంతాల్లో రెసిడెన్సియల్, కమర్షియల్ భవనాల నిర్మాణాలు జోరందుకున్నాయి.
సౌత్ సిటీ చుట్టూ ఫార్మా సిటీ, ఆదిభట్ల ఎయిర్ స్పేస్, తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ, శ్రీశైలం హైవే, కోకాపేట న్యూ సిటీ, బుద్వేల్ ఐటీ పార్క్, కాంచన్ బాగ్ డీఆర్డీఎల్, రాజేంద్ర నగర్ ఆగ్రి వర్సిటీ వంటి ప్రాంతాలకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయి. దీంతో కమర్షియల్ యాక్టివిటీ బాగా పెరుగుతోంది. ఇక్కడ భూముల రేట్లు వెస్ట్, ఈస్ట్ సిటీతో సమానంగా ఉండగా ఐటీ కారిడార్ కు చేరువలో, శంషాబాద్ ఎయిర్ పోర్టుకు దగ్గరగా ఉండటం సౌత్ జోన్ కు స్పెషల్ అడ్వాంటేజ్ గా మారింది.
పోచారంలో ఐటీ పార్కు డెవలప్ చేసినట్లుగా, ఈ ప్రాంతానికి పెద్దగా ఐటీ పార్కులు ఏర్పాటు చేయక పోయినా.. కూడా కమర్షియల్ పరంగా మంచి డిమాండే ఉంది. ముఖ్యంగా అపార్టుమెంట్లు ఇప్పుడిప్పుడే విస్తరిస్తుండగా, రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల్లోనూ అపార్టుమెంట్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. రోడ్లు, స్కూళ్లు, విద్యా సంస్థలు, హాస్పిటళ్లు, కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి వస్తే గనుక ఈ ఏరియాకు మంచి డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
No comment allowed please