Rebel Mla’s Dance : రెబ‌ల్ ఎమ్మెల్యేల డ్యాన్స్ అదుర్స్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Rebel Mla’s Dance : గ‌త ప‌ది రోజులుగా ఉత్కంఠ రేపుతూ వ‌చ్చిన మ‌హారాష్ట్ర సంక్షోభానికి తెర ప‌డింది. శివ‌సేన పార్టీ చీఫ్, సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. గ‌వ‌ర్న‌ర్ కు తానే స్వ‌యంగా కారు న‌డుపుకుంటూ వెళ్లి రాజీనామా ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.

దీంతో కోషియార్ ఆయ‌న రాజీనామా ప‌త్రాన్ని ఓకే చేశారు. గురువారం చేప‌ట్టాల్సిన బ‌ల‌ప‌రీక్ష‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అసెంబ్లీ కార్య‌ద‌ర్శి. శివ‌సేన సుప్రీంకోర్టులో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని స‌వాల్ చేస్తూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

కానీ కోర్టు తాము జోక్యం చేసుకోలేమంటూ తిర‌స్క‌రించింది. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ నుంచి నేరుగా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి బ‌ల‌ప‌రీక్ష చేప‌ట్టాలంటూ విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు బీజేపీ చీఫ్‌, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్.

ఆయ‌న‌తో పాటు రెబ‌ల్ ఎమ్మెల్యేలు కూడా లేఖ‌లు స‌మ‌ర్పించారు. ఇక సీఎం త‌నంత‌కు తానుగా త‌ప్పు కోవ‌డంతో బ‌ల‌ప‌రీక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీంతో మొత్తం మ‌రాఠా సీన్ ఢిల్లీకి మారింది. ఇదే స‌మ‌యంలో ఫ‌డ్న‌వీస్(Devendra Fadnavis) మ‌రోసారి సీఎంగా కొలువు తీరుతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఊహించ‌ని రీతిలో ఉత్కంఠ రేపుతూ తాను సీఎం కావ‌డం లేద‌ని ప్ర‌కటించారు ఫ‌డ్న‌వీస్.

సీఎంగా రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఏక్ నాథ్ షిండే (Eknath Shinde) గా ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని వెల్ల‌డించారు. రేపు రాత్రి 7.30 గంట‌ల‌కు ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని తెలిపారు.

తాము బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు. ఇక షిండే సీఎం గా ప్ర‌క‌టించిన వెంట‌నే గోవా టూర్ లో ఉన్న రెబ‌ల్ ఎమ్మెల్యేలు హోట‌ల్ లో ఆనందం ప‌ట్ట‌లేక డ్యాన్సులు(Rebel Mla’s Dance) చేశారు. ఈ వీడియో వైర‌ల్ గా మారింది నెట్టింట్లో.

Also Read : అట్ట‌డుగు నుంచి అత్యున్న‌త స్థానం

Leave A Reply

Your Email Id will not be published!