Tirumala Devotees : రికార్డు స్థాయిలో భ‌క్తుల ద‌ర్శ‌నం

ఆదివారం 92,238 మంది భ‌క్తులు

Tirumala Devotees : తిరుమ‌ల‌కు భ‌క్తుల పోటెత్తారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఊహించ‌ని రీతిలో పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. సెల‌వులు ముగియ‌డం, బ‌డులు ప్రారంభం కావ‌డంతో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని , అలివేలు మంగ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు త‌ర‌లి వ‌చ్చారు తండోప తండాలుగా.

గ‌త కొన్నిరోజుల నుంచి ప్ర‌తి రోజూ 70 వేల‌కు పైగా భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. కానీ నిన్న ఒక్క రోజే ఏకంగా భ‌క్తుల సంఖ్య 90 వేల‌కు మించి పోయింది. మొత్తం 92 వేల 238 మంది స్వామి వారి కృప‌కు పాత్రుల‌య్యారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టింది. చైర్మ‌న్ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి ద‌గ్గ‌రుండి భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు క‌ల్పించేలా చూశారు.

భ‌క్తుల ర‌ద్దీ దృష్ట్యా వీఐపీ ద‌ర్శ‌నాల‌కు కొంత విరామం ఇచ్చారు. ఇక 40 వేల 400 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మర్పించారు. ఇక స్వామి వారికి భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు , విరాళాలు ఏకంగా రూ. 4 కోట్ల 2 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని అధికారికంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

ఇదిలా ఉండ‌గా స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు ఇంకా కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. స‌ర్వ ద‌ర్శ‌నం టోకెన్లు లేకుండా వేచి ఉన్న భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం స‌మ‌యం క‌నీసం 24 గంట‌లు ప‌ట్ట‌నుంద‌ని టీటీడీ తెలిపింది. మొత్తంగా రికార్డు స్థాయిలో భ‌క్తులు పోటెత్త‌డం టీటీడీని విస్తు పోయేలా చేసింది.

Also Read : Nara Lokesh : రాయ‌ల‌సీమ‌కు జ‌గ‌న్ చేసిందేమిటి

Leave A Reply

Your Email Id will not be published!