#Elections : జమిలీ ఎన్నికల‌తో పాటు ఎన్నిక చట్టంలో సంస్కరణలు రావాలి

Elections : దేశమంతా ఒకేసారి అన్ని రకాల‌ ఎన్నిక పద్ధతి గురించి (జమిలీ ఎన్నిక పద్ధతి) మూడు నాులుగు సంవత్సరాల‌ కిందట కొంత మేర చర్చ జరిగినప్పటికీ... ఈ మధ్య ఆ అంశం మీద భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. వాస్తవంగా మేడిపండులాంటి

Elections : దేశమంతా ఒకేసారి అన్ని రకాల‌ ఎన్నిక పద్ధతి గురించి (జమిలీ ఎన్నిక పద్ధతి) మూడు నాులుగు సంవత్సరాల‌ కిందట కొంత మేర చర్చ జరిగినప్పటికీ… ఈ మధ్య ఆ అంశం మీద భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. వాస్తవంగా మేడిపండులాంటి నేటి భారత ఎన్నిక చట్టం నందు అనేక రకా లొసుగులు వున్నందున ఎన్నికలు అనగానే కోట్లు, బెట్టింగు, ల్యాబీలు, సమీకరణలు, స్పెషల్‌ క్యాంపు అనే దుస్థితి ఏర్పడింది. కొంతమందికి నేటి రాజకీయాలు, వాటి ద్వారా పైరమీ అనేవి పెట్టుబడిలేని వ్యాపారాలు, గా మారాయి. స్వాతంత్య్రానంతరం కొత్త రాజ్యాంగం అములోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌నందు ఒకేసారి అటు పార్లమెంట్‌కు, ఇటు అసెంబ్లీకు మూడు పర్యాయాలు, ఎన్నిలుకు జరిగాయి.

ఆ తరువాత అసెంబ్లీలు, కొన్ని రాష్ట్రాల‌నందు అర్ధాంతరంగా రద్దు కావడం, పార్లమెంట్‌కు సైతం మధ్యలో మూడు నాలుగు సార్లు మధ్యంతర ఎన్నికలు రావడం వంటి పరిణామాతో ఇప్పుడు భారత రాజకీయ ఎన్నిక వ్యవస్థ గందరగోళంగా మారి ప్రతియేటా లేదా ఆరు నెలకు ఒకసారి దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో….రాష్ట్రాల‌లో ఏదో ఒక ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నిక‌కు లేదా పార్లమెంట్‌ ఉప ఎన్నిక‌కు లేదా అసెంబ్లీ ఉప ఎన్నిక జరుగుతూ వస్తున్నాయి.

ఎన్నిక ల నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు ఆయా ప్రాంతాల‌లో లేదా రాష్ట్రాల‌లో ఇంచుమించు నెరోజు మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోతున్నాయి. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఎన్నికలో అవినీతి ఏరోజుకారోజు పెరిగిపోతున్నది. గ్రామీణ ప్రాంతాలో ఏదో ఒక పదవి వుంటే… భవిష్యత్తు రాజకీయాకు పునాది ఏర్పడుతుందని ప్రజల‌లో సామాజిక హోదా, గౌరవం వుండాల‌ని తద్వారా మిగతా పనులు కొన్ని అవంతకు అవే జరిగిపోతాయని ఐదు వంద నుంచి వెయ్యి మంది ఓటర్లు వున్న గ్రామ పంచాయితీల‌కు సర్పంచుగా, ఎం.పి.టి.సిలుగా గెల‌వడానికి పదిహేను, ఇరవై ల‌క్షలు ఖర్చుపెడుతున్నారు.

పట్టణాలో అదే స్థాయి కలిగిన వార్డ్‌ కౌన్సిర్లకు ఇదే విధంగా ఖర్చు పెడుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, డిల్లీి, బెంగుళూర్‌, ముంబై వంటి మెట్రో నగరానందు కార్పొరేటర్‌గా గెవడానికి కోటి నుంచి రెండు కోట్లు వెదజ్లుతున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేయాంటే… ఐదు కోట్ల నుంచి ఇరవై కోట్లు సిద్ధం చేసుకోవసి వుంది. ఎం.పి.గా పోటీ చేయడానికి యాభై కోట్ల నుంచి వంద కోట్లు పక్కన తీసిపెట్టాలి. దొడ్డిదారి పదవులైన ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి వాటికి పార్టీ అధినేతకు యాభై కోట్ల నుంచి వంద కోట్లు బహుమతిగా ఇచ్చుకోవాలి. ఇంత ఖర్చు పెట్టి గెలిచిన తరువాత వారు కొనసాగుతున్న పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి వారి వ్యాపార కార్యకలాపాల‌కు పాల‌కపక్ష నేతు ఏవైనా అవాంతరాలు సృష్టిస్తారేమోనని భయంతో అధికార పార్టీలోకి వెళ్లిపోవడం ఈ మధ్యకాలంలో మరీ నిత్యకృత్యమైంది.

అధికారిక పీఠం మీద వున్నవారిని దింపడానికి కొంతమంది ధన కామంధు.లు.. సి.ఎం. స్థాయి వ్యక్తుల‌ను తారుమారు చేయడానికి ఐదు వంద కోట్ల నుంచి వెయ్యి కోట్లు, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌గా ఎన్నిక కావడానికి మండల‌ స్థాయి నేతను పోగు చేయడం కోసం పది పదిహేను కోట్లు, మేయర్‌ కుర్చీ దక్కించుకోవడానికి కూడా ఇదే స్థాయి కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే… ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి సి.ఎం.గా ఎన్నికయ్యే నేతల‌కు మద్దతునివ్వడానికి తాను ఖర్చు పెట్టిన సొమ్మంతా ఒకేసారి దక్కించుకునే విధంగా అమ్ముడుపోతున్నాడు.

జడ్పీటీసీు, కౌన్సిర్లు, ఎం.పి.టి.సి.ు, కార్పొరేటర్లు స్థాయిని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి ఐదు క్ష నుంచి యాభై ల‌క్ష ల వరకు అమ్ముడుపోతున్నారు. ఈ విధంగా భారత ఎన్నిక ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారినందున నేడు సమాజంలో అనేక రకా అవినీతి కార్యకలాపాకు ఎన్నిక అవినీతి కారణమైనందున దేశ సుస్థిరత, భద్రత, ఆర్థిక సంక్షేమం దృష్ట్యా దేశవ్యాప్తంగా ఒకేసారి అటు పార్లమెంట్‌కు, ఇటు రాష్ట్రా అసెంబ్లీకు, స్థానిక సంస్థకు ఎన్నికు జరిగితే…. చాలా వరకు ఎన్నిక వ్యవస్థ ప్రక్షాళన కావడానికి అవకాశం వుంది. ఇలాగే…. అమెరికాలో ప్రెసిడెంట్‌గా పోటీ చేసేవ్యక్తిని ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకుంటున్నారు. అతడు రెండు పర్యాయముకు మించి ఆ పదవిలో కొనసాగడానికి అవకాశం లేదు.

ఈ తరహాలో మనకు కూడా ప్రధానమంత్రిని ప్రత్యక్ష పద్ధతిన ఎన్నుకునే విధానం రావాలి. ఎవరైనా సరే రొటేషన్‌ పద్ధతిన ఎన్నిక కావాలి. రాజరికం వెళ్లినప్పటికీ…. ప్రజాస్వామ్యం ముసుగులో కొంతమంది ఐదారు పర్యాయాులు ఎమ్మెల్యేుగా, ఎం.పి.లుగా దశాబ్దాల తరబడి కొనసాగుతున్నారు. వారి అనంతరం వారసులు అవే పదవు పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పదవు అనుభవిస్తున్నారు. ఎమ్మెల్యేగా లేదా ఎం.పి.గా రెండు పర్యాయము ల కన్నా మించి వుండకూడదు అనే విధంగానూ…సామాజిక న్యాయంలో భాగంగా అన్ని వర్గాల‌కు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రజా ప్రతినిధులుగా ఎన్నిక కావడానికి అవకాశం కల్పించాలి.

ఇలాగే… కొన్ని ప్రత్యేక నిబంధనల‌తో… ఎన్నికల‌లో పోటీ చేసే అభ్యర్థు ఖర్చు ప్రభుత్వమే భరించేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురావాలి. రబ్బర్‌ స్టాంపుల్లాంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వ్యవస్థనలో అధికారాలు క‌ల్పించాలి. ఈనేరుగా ప్ర‌జ‌లే వారిని ఎన్నుకునే చ‌ట్టాలు రావాలి. ఇలా ఎన్నిక సంస్కరణతో కొత్త చట్టాన్ని రూపొందించి ఆ తరహాలో జమిలీ ఎన్నిల‌ను నిర్వహిస్తే… భారత రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన కావడంతో పాటు తద్వారా సామాజిక వ్యవస్థ కూడా నీతివంతంగా ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. భారత ప్రధాని మోదీ ఈ మధ్యకాంలో అనేక సాహసోపేత నిర్ణయాు తీసుకుంటున్నందున జమిలీ ఎన్నిక ల వ్యవస్థను కూడా తీసుకువచ్చి భారతదేశ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాల‌ని కోరుకొంటున్నారు ప్ర‌జ‌లు. ఇది పాల‌కులు ఎప్ప‌టికి తెలుసుకుంటారో మ‌రి.

No comment allowed please