Delhi Drain : ఢిల్లీలో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం

బైరోన్ మందిర్ స‌మీపంలో గోడ మ‌ర‌మ్మ‌తు

Delhi Drain : ఉత్త‌ర భార‌తంలో చోటు చేసుకున్న వ‌ర‌ద‌ల ప్ర‌భావం దేశ రాజ‌ధాని ఢిల్లీని అత‌లాకుత‌లం చేస్తోంది. య‌మునా న‌ది ఉగ్ర రూపం దాల్చుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మాద స్థాయిని దాటి ప్ర‌వ‌హించింది. దీంతో న‌గ‌రంలోని ర‌హ‌దారుల‌న్నీ వ‌ర‌ద‌ల్లో నీట మునిగాయి. రాజ్ ఘాట్ కు కూడా నీళ్లు చేరాయి. దీంతో స్వ‌యంగా స‌హాయ‌క ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎవ‌రికీ ఇబ్బందులు లేకుండా చేశారు.

విచిత్రం ఏమిటంటే సీఎం ఇల్లు కూడా కొన్ని రోజులు నీళ్ల‌లోనే ఉండి పోయింది. ఇదిలా ఉండ‌గా కేంద్రం కావాల‌ని ఉత్త‌రాఖండ్, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నుంచి వ‌స్తున్న నీళ్ల‌ను కావాల‌ని ఢిల్లీ వైపు మ‌ళ్లిస్తోందంటూ ఆరోపించారు. ఈ త‌రుణంలో వ‌ర‌ద ఉధృతి దెబ్బ‌కు ఢిల్లీ లోని బైరోన్ మందిర్ స‌మీపంలోని జన‌తా క్యాప్ వ‌ద్ద డ్రైయిన్ గోడ విరిగి పోయింది.

దీంతో హుటా హుటిన ఢిల్లీ న‌గ‌ర పాల‌క సంస్థ సిబ్బందితో పాటు ఆప్ శ్రేణులు రంగంలోకి దిగాయి. విరిగిన గోడ‌ను మ‌ర‌మ్మ‌తు చేసేందుకు నిన్న రాత్రంతా ప‌ని చేశాయి. వ‌ర‌ద దెబ్బ‌కు ముందు జాగ్ర‌త్త‌గా నివాసితులంద‌రినీ ఖాళీ చేశారు. స‌హాయ‌క శిబిరాల‌కు త‌ర‌లించారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు రాకుండా ఉండేలా చూడ‌డంలో ఢిల్లీ ప్ర‌భుత్వం కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Also Read : Vijay Sethupathi : కేవ‌లం బాద్ షా కోసం న‌టించా – సేతుప‌తి

Leave A Reply

Your Email Id will not be published!