Supreme Court Relief : సోనాలీ కేసులో ‘క‌ర్లీస్’ కు ఉప‌శ‌మ‌నం

రెస్టారెంట్ కూల్చివేతపై 16న విచార‌ణ

Supreme Court Relief :  ప్ర‌ముఖ టిక్ టాక్ స్టార్, హ‌ర్యానా బీజేపీ నాయ‌కురాలు సోనాలీ ఫోగ‌ట్ అత్యాచారం, హ‌త్య కేసు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఆమె కుటుంబీకులు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని, గోవా పోలీసులు స‌హ‌క‌రించ‌డం లేదంటూ ఆరోపణ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా సోనాలీ కేసులో ఆమె స‌హాయ‌కుడు, అత‌డి స్నేహితుడితో పాటు గోవాలోని క‌ర్లీస్ రెస్టారెంట్ య‌జ‌మాని, డ్ర‌గ్స్ డీల‌ర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఫోగ‌ట్ మ‌ర‌ణంతో ముడిప‌డి ఉన్న గోవా రెస్టారెంట్ క‌ర్లీని కేసులో చేర్చారు.

ఈజాగా ఈ కేసుకు సంబంధించి క‌ర్లీకి ఉప‌శ‌మ‌నం క‌లిగింది. సుప్రీంకోర్టు(Supreme Court Relief)  ఇవాళ కేసు విచార‌ణ చేప‌ట్టింది. గోవాలో ప్ర‌సిద్ది చెందిన అంజునా బీచ్ లో ఉంది ఈ రెస్టారెంట్.

ఆమె మ‌ర‌ణానికి కొన్ని గంట‌ల ముందు సోనాల్ ఫోగ‌ట్ అక్క‌డ పార్టీ చేసుకోవ‌డంతో ఇటీవ‌ల వార్త‌ల్లో నిలిచింది. కేసుకు సంబంధించి క‌ర్లీస్ రెస్టారెంట్ కూల్చివేత‌ను కూల్చి వేసే ప్ర‌క్రియ‌ను గోవా ప్ర‌భుత్వం ప్రారంభించింది.

కొన్ని గంట‌ల త‌ర్వాత సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది. కాగా రెస్టారెంట్ ను కూల్చి వేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ పై నిర్ణ‌యం తీసుకునే వ‌ర‌కు దాని వాణిజ్య కార్య‌క‌లాపాల‌ను నిలిపి వేయాల‌ని కోర్టు ఆదేశించింది.

సెప్టెంబ‌ర్ 16 త‌దుప‌రి విచార‌ణ తేదీగా నిర్ణ‌యించింది. నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ లేదా ఎన్జీటీ ఎటువంటి ఉప‌శ‌మ‌నం పొంద‌డంలో విఫ‌ల‌మైన త‌ర్వాత రెస్టారెంట్ కూల్చి వేత చ‌ర్య ప్రారంభ‌మైంది.

గ్రీన్ రూల్స్ పాటించ‌నందుకు రెస్టారెంట్ ను కూల్చి వేయాలంటూ గోవా కోస్ట‌ల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ గ‌తంలో చేసిన ఆదేశాల‌ను ఎన్జీటీ స‌మ‌ర్థించింది.

Also Read : బీహార్ సీఎంపై పీకే షాకింగ్ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!