Meghalaya CM : కాసినోలు తెర‌వ‌డంపై పున‌రాలోచ‌న – సీఎం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన కాన్రాడ్ కె సంగ్మా

Meghalaya CM : మేఘాల‌య రాష్ట్ర ముఖ్య‌మంత్రి క‌న్రాడ్ కె సంగ్మా(Meghalaya CM) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కాసినోలు తెర‌వ‌డంపై పున‌రాలోచ‌న చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా మేఘాల‌య రెగ్యులేష‌న్ ఆఫ్ గేమింగ్ యాక్డ్ ను ర‌ద్దు చేయ‌డాన్ని తోసిపుచ్చారు. అసెంబ్లీలో మాట్లాడిన ఒక రోజు త‌ర్వాత ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

కేటాయించిన 3 సంస్థ‌ల 6 నెల‌ల తాత్కాలిక లైసెన్సుల‌ను పున‌రుద్ద‌రించకుండానే రాష్ట్రంలో కాసినోల‌ను తెర‌వ‌డంపై తాము పున‌రాలోచిస్తున్న‌ట్లు తెలిపారు సీఎం.

గేమింగ్ కు సంబంధించిన దుష్ప్ర‌భావాల నుండి స్థానిక ప్ర‌జ‌ల‌ను నిరోధించేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌న్నారు. కాగా గేమింగ్ యాక్ట్ , రూల్స్ 2021ని ర‌ద్దు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు నోంగ్ క్రెమ్ ఎమ్ఎల్యే లాంబోర్ మ‌ల్ంగియాంగ్ .

ఈ మేర‌కు శాస‌న‌స‌భ‌లో జీరో అవ‌ర్ నోటీసు ఇచ్చారు. దీనిపై సీఎం కాన్రాడ్ కె సంగ్మా(Meghalaya CM) స‌మాధానం ఇచ్చారు. గేమింగ్ ప‌రంగా తీసుకున్న చ‌ర్య‌లు, నియ‌మాలు స్థానికులు ఆడ‌కుండా నిరోధించాయ‌ని తెలిపారు.

దీనిని ర‌ద్దు చేస్తే యువ‌త ఆడేందుకు వీలుంది, ఎటువంటి నియంత్ర‌ణ అన్న‌ది ఉండ‌ద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు సీఎం. రాయ‌ల్టీ ద్వారా వ‌చ్చే ఆదాయం రూ. 600 కోట్ల నుంచి రూ. 100 కోట్ల‌కు ప‌డి పోయింద‌ని వెల్ల‌డించారు.

రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకు వ‌చ్చేందుకు గేమింగ్ జోన్ చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌న్నారు సంగ్మా. మొత్తం ప్ర‌క్రియ‌ను స‌మ‌తుల్యం చేయాల‌ని అనుకుంటున్నామ‌ని సీఎం చెప్పారు.

రూ. 500 కోట్ల ఆదాయం వ‌చ్చేలా చూడాల‌ని ఇప్ప‌టికే నిర్దేశించామ‌న్నారు.  మేఘాల‌యం సీఎం కాన్రాడ్ కె సంగ్మా.

Also Read : 60 వీడియోలు షేర్ చేయ‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!