Revanth Reddy Arrest : గన్ పార్క్ వద్ద రేవంత్ అరెస్ట్
భారీగా మోహరించిన పోలీసులు
Revanth Reddy Arrest : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ కు మీడియా సాక్షిగా సవాల్ విసిరారు.
Revanth Reddy Arrest Viral
దమ్ముంటే త్వరలో రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో మద్యం, మనీ లేకుండా రంగంలోకి దిగాలని , ఇందుకు సంబంధించి కేసీఆర్ రావాలని, తాను కూడా వస్తానని ప్రకటించారు.
గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపం సాక్షిగా తాను చేసిన సవాల్ కు సీఎం రావాలంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా గాంధీ భవన్ కు తరలించే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు , పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా రెండు రోజుల కిందట కేసీఆర్ కు సవాల్ విసిరిన సంగతి విదితమే. మరో వైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారి పోయింది.
బీజేపీ, ఎంఐఎం , బీఆర్ఎస్ ఒక్కటేనంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. త్వరలో తాము పవర్ లోకి వస్తామని కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
Also Read : G Kishan Reddy : ప్రవల్లికది ప్రభుత్వ హత్య