Revanth Reddy : కాంగ్రెస్ ఫ్లడ్ రిలీఫ్ కమిటీ – రేవంత్
కోదండరెడ్డి చైర్మన్, 12 మంది సభ్యులు
Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఫ్లడ్ రిలీఫ్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ కమిటీకి చైర్మన్ గా కోదండ రెడ్డిని నియమించినట్లు తెలిపారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ కమిటీలో మరో 12 మందిని సభ్యులుగా నియమించినట్లు టీపీసీసీ అధికారికంగా వెల్లడించింది.
Revanth Reddy Taking Responsibility
బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వాయుగుండంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను వానలు ముంచెత్తాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచి కొట్టాయి. భారీ ఎత్తున కురుస్తున్న వర్షాలకు జన జీవనం , రవాణా వ్యవస్త అస్తవ్యస్తంగా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు, కుంటలు, చెరువులు నిండి పోయాయి. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ , తదితర జిల్లాలను వరదలు ముంచెత్తాయి. చాలా చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రాజెక్టులన్నీ ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కృష్ణా , గోదావరి నదులు జల కళను సంతరించుకున్నాయి.
ఇప్పటి వరకు వరదల తాకిడికి 9 మంది గల్లంతు కాగా 17 మంది మరణించినట్లు సమాచారం. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలలో పార్టీ పరంగా సహాయక చర్యలు చేపట్టేందుకు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు రేవంత్ తెలిపారు.
Also Read : Jailer Kaavaalaa Song : తలైవా కావాలా సాంగ్ రికార్డ్ బ్రేక్ 81 మిలియన్ వ్యూస్