Revanth Reddy : కేసీఆర్..ఓవైసీపై రేవంత్ కామెంట్స్

వాళ్లిద్ద‌రూ మోదీకి స్నేహితులు

Revanth Reddy : హైద‌రాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో అన్ని పార్టీల‌కు చెందిన నేత‌లు, ప్ర‌తిప‌క్షాల చీఫ్ లు, సీఎంలపై కేసులు న‌మోదు చేశార‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు చేయించారంటూ ఆరోపించారు. కానీ దేశంలో ఇద్ద‌రిపై మాత్రం కేసులు న‌మోదు చేయ‌లేద‌ని ఎద్దేవా చేశారు. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో కాదు ఒక‌రు బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రొక‌రు ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ అని స్ప‌ష్టం చేశారు.

Revanth Reddy Serious Comments

రాష్ట్రంలో జ‌నం కేసీఆర్ ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఆయ‌న రోజూ వాడే టాబ్లెట్ లాంటోడ‌ని , దానికి కూడా గ‌డువు తేదీ ఉంటుంద‌ని ఇప్పుడు సీఎం డేట్ పూర్త‌యింద‌ని, ఆయ‌న ప‌నై పోయింద‌న్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్క‌టేన‌ని ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). విచిత్రం ఏమిటంటే తాము ఆరోప‌ణ‌లు చేసినా ఏకే గోయ‌ల్ పై చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు.

ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీఆర్ఎస్ స‌ర్కార్ కు వ‌త్తాసు ప‌లుకుతోంద‌ని ఆరోపించారు . ఆయ‌న ఓ ఛాన‌ల్ తో బిగ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్, రామ‌చంద్ర మూర్తి, కోదండ రాం రెడ్డి పాల్గొన్నారు.

Also Read : Priyanka Gandhi : దొర‌కు ఓటేస్తే అవినీతికి వేసిన‌ట్టే

Leave A Reply

Your Email Id will not be published!