Revanth Reddy : ఈసీ తీరుపై రేవంత్ గుస్సా
పోస్టల్ బ్యాలెట్ సమస్యపై తాత్సారం
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
Revanth Reddy Serious Comments on EC
నవంబర్ 30న ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో చోటు చేసుకున్న సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ లేక పోవడం దారుణమని పేర్కొన్నారు.
నాలుగు లక్షల మంది ఉద్యోగులు ఇవాళ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఎందుకని స్పందించడం లేదంటూ వికాస్ రాజ్ పై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేసే ఛాన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.
విచిత్రం ఏమిటంటే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు తమకు ఓటు కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగడం దారుణమన్నారు రేవంత్ రెడ్డి. ఇకనైనా వికాస్ రాజ్ నిబద్దతతో విధులు నిర్వహించాలని కోరారు.
Also Read : PM Modi Visit : శ్రీనివాసుడిని దర్శించుకున్న పీఎం