Revanth Reddy : తెలంగాణ ఇవ్వ‌డం వ‌ల్ల న‌ష్టం

రేవంత్ షాకింగ్ కామెంట్స్

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ బాధ్య‌త క‌లిగిన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నోరు జారారు. వంద‌లాది మంది బ‌లిదానాలు, ఆత్మ త్యాగాలతో ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

Revanth Reddy Shocking Comments

తెలంగాణ ఇవ్వ‌డం అనేది న‌ష్టం చేకూర్చే నిర్ణ‌యం అంటూ పేర్కొన్నారు. ఆ రోజు తెలంగాణ ఇచ్చేందుకు ఏ కోశానా ఛాన్స్ లేద‌న్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ వాదులు భ‌గ్గుమంటున్నారు. మొన్న‌టికి మొన్న అమెరికాకు వెళ్లి అక్క‌డ కూడా విద్యుత్ స‌ర‌ఫరాపై నోరు పారేసుకున్నారు.

తాము ఏది చెబితే అది చ‌ట్టంగా మారుతుంద‌ని అనుకుంటున్నారు కొంద‌రు నేత‌లు. ఓ వైపు కేసీఆర్ ఇంకో వైపు రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ప్ర‌జ‌ల‌కు ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని తెలుసు కోవాలి.

సంక్షేమ ప‌థకాల పేరుతో ఇచ్చేదంతా వాళ్ల జేబుల్లోంచో లేదా వారి స్వంత ఖాతాల్లోంచి , వారు సంపాదించిన దాంట్లోంచి ఇవ్వడం లేద‌నే విష‌యం గుర్తించాల‌ని బుద్ది జీవులు పేర్కొంటున్నారు. ఇక‌నైనా మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడాల‌ని కోరుతున్నారు జ‌నం.

Also Read : Priyank Kharge : సీఎం ప‌ద‌వి ఇస్తానంటే ఓకే

Leave A Reply

Your Email Id will not be published!