హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో జనానికి ఓ బైబిల్ , ఖురాన్, భగవద్గీత లాంటిందన్నారు టీపీసీసీ ఎనుముల రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున్ ఖర్గే పార్టీ తయారు చేసిన అభయ హస్తం మేని ఫోస్టోను విడుదల చేశారు. ఇందులో మొత్తం 42 పేజీలు 62 అంశాలకు ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. తాము తీసుకు వచ్చిన మేని ఫెస్టో రాష్ట్ర ప్రజలు నిత్యం గౌరవంగా భావించే ఖురాన్, బైబిల్ , భగవద్గీత లాంటిందని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి ఆమోద యోగ్యంగా ఉండేలా దీనిని తయారు చేశామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. యువత, మహిళలు, వృద్దులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులకు మేలు చేకూర్చేలా ఉందన్నారు రేవంత్ రెడ్డి.
తాము పవర్ లోకి వచ్చిన వెంటనే ఆరు నెలల్లోపు డీఎస్సీ నిర్వహించి తీరుతామన్నారు. అంతే కాకుండా 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తామన్నారు. మరణించిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. బీసీ సంక్షేమ భవనాలను నిర్మిస్తామన్నారు.