Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ గా, మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి ఈసారి శాసనసభ ఎన్నికల బరిలో ఉండనున్నారు. గతంలో కోడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రస్తుతం మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
Revanth Reddy Got a Chance
ఎమ్మెల్యేగా ఓటమి పొందిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యారు. ఆ వెంటనే మల్కాజ్ గిరి ఎంపీ సీటు పొందారు. అక్కడ గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ గా ఎంపికయ్యారు. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఆయన ఒంటెత్తు పోకడ నచ్చక సీనియర్ నేతలు రాజీనామా బాట పట్టారు. వారిలో మాజీ సీఎం చిన్నారెడ్డి తనయుడు గుడ్ బై చెప్పారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ గొంతుకగా ఉంటూ వచ్చిన జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ దాసోజు శ్రవణ్ రేవంత్ పై నిప్పులు చెరుగుతూ రాజీనామా చేశారు.
ఆ వెంటనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక టీపీసీసీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి గా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.
Also Read : Nagam Janardhan Reddy : నాగంకు షాక్ కాంగ్రెస్ ఝలక్
