Revanth Reddy : ప్రగతి భవన్ ను కూల్చేయాలి – రేవంత్
రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం కేసీఆర్ కట్టుకున్న ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో పేల్చి వేయాలని పిలుపునిచ్చారు. అప్పుడు కాని తెలంగాణకు పట్టిన పీడ విరగడవుతుందన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నాయకులు భగ్గుమన్నారు. ఇంకోసారి తమ పార్టీ చీఫ్ కేసీఆర్ పై నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు టీపీసీసీ చీఫ్.
దొర గడీలను గ్రెనేడ్లతో పేల్చేయాలంటూ పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. సామాన్యులకు ఎంట్రీ లేని ప్రగతి భవన్ ను పేల్చేస్తే శని పోతుందన్నారు. పార్టీ పెట్టక ముందు రబ్బరు చెప్పులు లేని కేసీఆర్ కు వేల కోట్ల ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయంటూ ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేని మగోడు హైదరాబాద్ నడిబొడ్డున 10 ఎకరాల్లో విలాస వంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
రూ. 2 వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆరోపించారు. 150 గదులతో అందమైన ప్యాలెస్ ను నిర్మించుకున్నాడని ఇది ఎవరి కోసమని ప్రశ్నించారు. ఈ 9 ఏళ్ల పాలనలో 23 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిన సీఎం ఆ నిధులను ఎవరి కోసం ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : సీఎం కేసీఆర్ పై కేసు పెట్టాలి – ఆర్ఎస్పీ