Revanth Reddy DGP : హైకోర్టు ఆదేశించినా భద్రత పెంచరా
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ
Revanth Reddy DGP : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. తనకు భద్రత కల్పించే విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందని , అయినా ఇప్పటి వరకు ఎందుకు సెక్యూరిటీ పెంచలేదంటూ వాపోయారు. గతంలో తన ప్రాణానికి ముప్పు ఉందంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
Revanth Reddy DGP to Appeal
గతంలో తాను చేపట్టాల్సిన యాత్ర గురించి భద్రత పెంచాలని కోరుతూ దావా దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇదే విషయంలో విచారణ సందర్భంగా ఎన్నికలు ముగిసేంత వరకు తనకు హై సెక్యూరిటీ కల్పిస్తామని సర్కార్ కోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి.
ఇప్పటి వరకు తనకు అదనపు సెక్యూరిటీ ఎందుకు పెంచడం లేదో తనకు అర్థం కావడం లేదన్నారు. తాను కాబోయే సీఎం అభ్యర్థినని , తనపై ఎందరో కళ్లు ఉంటాయని, ఈ సమయంలో పూర్తి సెక్యూరిటీ మధ్యన తాను ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలా ఉండగా హైకోర్టులో 69 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తున్నామంటూ పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). వెంటనే తనకు అదనపు సెక్యూరిటీ కల్పించాలని డీజీపీని కోరారు. దీనిపై ఇంకా ఆయన స్పందించ లేదు.
Also Read : Sajjala Ramakrishna Reddy : భారీగా స్కామ్ లు అందుకే కేసులు