Revanth Reddy KCR : కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ ఆరా
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
Revanth Reddy : హైదరాబాద్ – తన ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి జారి పడ్డారు కేసీఆర్. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవితతో పాటు కేసీఆర్ భార్య కూడా కేసీఆర్ పక్కనే ఉన్నారు.
Revanth Reddy’s inquiry on KCR’s health
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం సీఎం రేవంత్ రెడ్డికి(Revanth Reddy) తెలిసింది. దీంతో ఆయన ఆరోగ్యంపై సీఎస్ శాంతి కుమారితో ఆరా తీశారు. ఆస్పత్రిని సందర్శించి కేసీఆర్ కు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని , పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని తాజాగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. మాజీ సీఎం త్వరగా ఆరోగ్యం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇక సీఎంగా కొలువు తీరిన వెంటనే పాలనా పరంగా తనదైన ముద్ర వేశారు. వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా దర్బార్ చేపట్టారు. కీలకమైన ఉన్నతాధికారులకు పోస్టులు ఇచ్చారు. కేసీఆర్ పక్కన పెట్టిన వారికి అందలం ఎక్కించారు. సీఎంఓ చీఫ్ సెక్రటరీగా శేషాద్రిని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
Also Read : Prabhakar Rao EX CMD : ప్రభాకర్ రావుకు సీఎం షాక్