Revanth Reddy : రేవంత్ రెడ్డి కామెంట్స్ కలకలం
సీతక్క సీఎంపై తానాలో కామెంట్స్
Revanth Reddy : తెలంగాణలో రేవంత్ రెడ్డి హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఆయన ఏది మాట్లాడినా అది చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న తానా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస ఆంధ్రులు (తెలుగు వారు) ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి ఓపికగా సమాధానం ఇచ్చారు.
ఇందులో ఒకరు కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే దళితులను సీఎంగా చేస్తారా అని ప్రశ్నించారు. కనీసం డిప్యూటీ సీఎం పదవి అయినా కట్టబెడతారా అంటూ నిలదీశారు. దీంతో ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెంటనే రియాక్ట్ అయ్యారు.
అవసరం గనుక వస్తే, తాము పవర్ లోకి రాగలిగితే వెంటనే డిప్యూటీ సీఎం ఎందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామంటూ ప్రకటించారు. ఇందుకు తాను బేషరతు మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి పై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
ఒకవేళ కాంగ్రెస్ కు ఛాన్స్ వస్తే అయితే రేవంత్ రెడ్డి లేదంటే మల్లు భట్టి విక్రమార్క మధ్య పోటీ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో సీతక్క రేవంత్ గ్రూప్ కు చెందిన నాయకురాలని ఇప్పటికే ఓ వర్గం ప్రచారం చేసింది కూడా. తాజాగా రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరింత పుండు మీద కారం చల్లినట్లయింది.
Also Read : India 2nd Largest : రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
