Revanth Reddy : డ్యాం సమస్య చిన్నది – రేవంత్
టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy : కొడంగల్ – తెలంగాణ రాష్ట్రంలో జనం డిసైడ్ అయ్యారని వార్ వన్ సైడ్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద చోటు చేసుకున్న వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా చిన్న సమస్య మాత్రమేనని పేర్కొన్నారు.
Revanth Reddy Comment about Nagarjuna Sagar Dam
సాగర్ డ్యామ్ ఎక్కడికీ పోదని అక్కడే ఉంటుందన్నారు. గతంలో లేని నీళ్ల సమస్య కేవలం ఎన్నికల పోలింగ్ సమయంలోనే రావడంలో రాజకీయ కోణం మాత్రమే ఉందన్నారు. దీనిని ప్రజలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు.
కొడంగల్ లో తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. అనంతరం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. డ్యాంకు సంబంధించి గేట్లు ఉంటాయని ఎక్కడికీ వెళ్లవన్నారు. నీళ్లు ఎలా తీసుకోవాలో తమకు తెలుసన్నారు. తాము పవర్ లోకి వస్తామని పక్క రాష్ట్రంతో స్నేహ పూర్వకమైన వాతావరణంలో సంబంధాలు ఉంటాయని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ఓటు వేసే సమయంలో నీళ్ల సమస్య ఎందుకు వస్తుందో ఆలోచించాలని ప్రజలకు విన్నవించారు. ఓటర్లు సంయమనం పాటించాలని మీకోసం ఎవరు పని చేస్తారో వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం రావడం ఖాయమని అంతా సర్దుకుంటుందన్నారు.
Also Read : Bandi Sanjay : ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవాలి