Revanth Reddy : ఇక నుంచి ప్రజా దర్బార్ కట్టుదిట్టం
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రజా దర్బార్ ఉంటుందని ప్రకటించారు. చెప్పినట్టుగానే శుక్రవారం నిర్వహించారు.
Revanth Reddy Comment about Praja Darbar
ఇక నుంచి ప్రజా దర్బార్ ను కట్టుదిట్టంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాకు ఒక టీమ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎస్ శాంతి కుమారిని. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతి పత్రాల పర్యవేక్షణకు ఓ సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
ప్రజా దర్బార్ కు రోజుకు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఉండేలా చూడాలని సూచించారు సీఎం. సీఎం ఉదయం 10 గంటల నుంచి ఓపికంగా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం విద్యుత్ , నీటి పారుదల శాఖల మీద సమీక్షించేందుకు వెళ్లారు.
దీంతో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కొలువు తీరిన దాసరి సీతక్క ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Also Read : MP Lakshman : సీఎం ఎంపిక బాధ్యత లక్ష్మణ్ కు