Revanth Reddy : కాంగ్రెస్ రాగానే ఖాతాల్లో వేస్తాం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ కు ఈసారి ఎన్నికలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా కాంగ్రెస్ గాలి వీస్తోంది. హస్తం హవా కొనసాగుతోంది. ఈ తరుణంలో రెండు రోజుల కిందట రైతు బంధు పథకం కింద రైతులకు నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి నవంబర్ 28న మంగళవారం ముహూర్తం నిర్ణయించింది.
Revanth Reddy Promise
అయితే ఇది పూర్తిగా ఎన్నికల్లో రైతులను , ఓటర్లను, ప్రజలను ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, ఇతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. కచ్చితంగా ఓట్లు తమకు వస్తాయని ఆనందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా బాధ్యత కలిగిన ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రితో పాటు మంత్రులు కచ్చితంగా ఈనెల 28న రైతు బంధు కింద నిధులు విడుదల చేస్తామంటూ ప్రకటించారు.
దీనిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈసీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీనిని ప్రాతిపదికగా తీసుకుని రైతు బంధుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఈ మేరకు వెంటనే నిలిపి వేయాలని ఆదేశించింది.
ఈసీ నిర్ణయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. మామా, అల్లుళ్ల అహంకారానికి చెక్ పెట్టడం స్వాగతిస్తున్నట్లు తెలిపింది. తాము 10 రోజుల్లో అధికారంలోకి వస్తామని , రైతు భరోసా కింద మీ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Also Read : KCR Slams : కాంగ్రెసోళ్లు దద్దమ్మలు – కేసీఆర్