Revanth Reddy : అందరు ఒప్పుకుంటేనే చేర్చుకుంటాం
టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి
Revanth Reddy : కింది స్థాయి నుంచి పై స్థాయిలో ఉన్న నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. ఆ మేరకే ఆయా పార్టీలకు చెందిన నేతలను స్వయంగా తాను, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుస్తున్నామని చెప్పారు. బుధవారం ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో రేవంత్ రెడ్డి కలిశారు. అనంతరం మాజీ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణా రావు వద్దకు వెళ్లారు. ఇద్దరు నేతలతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడారు రేవంత్ రెడ్డి.
హైకమాండ్ సూచనల మేరకు సీనియర్ల సహకారంతో తాను నేతలను కలుస్తున్నానని చెప్పారు. ఒక్కరి నిర్ణయంతో పనులు సాగవన్నారు. సమిష్టి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , ఇదే విషయం కర్ణాటకలో రూఢీ అయ్యిందన్నారు. భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదన్నారు. ఇక తెలంగాణలో రాక్షస, రాచరిక పాలనకు మూఢిందని, త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయమని జోష్యం చెప్పారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).
సాధ్యమైనంత మేరకు మాజీ ఎంపీ, మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కూడా తమ పార్టీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవలే జూపల్లి కృష్ణా రావు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Pawan Kalyan : రైతన్నలకు జనసేనాని భరోసా
