Revanth Reddy Missing : రేవంత్ మిస్సింగ్ అంటూ పోస్టర్లు
మల్కాజ్ గిరి నియోజకవర్గంలో వైరల్
Revanth Reddy Missing : తెలంగాణలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా దిగజారాయి. భాష మారింది, చివరకు ఒకరిపై మరొకరు జుగుస్సాకరంగా తిట్టుకునే స్థాయికి చేరుకున్నారు. వీరిని చూసి జనం విస్తు పోవడం మాట అటుంచితే నవ్వుకుంటున్నారు.
Revanth Reddy Missing Poster
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షాలు వర్సెస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. చివరకు పోస్టర్లు వెలిసే దాకా సాగింది. తాజాగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. దీంతో కుండ పోతగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ప్రయత్నం చేశాయి. ఈ తరుణంలో ఎవరు చేశారో కానీ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి చూద్దామంటే కనిపిస్తలేడంటూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి(Revanth Reddy Missing). ప్రస్తుతం ఈ పోస్టర్లు వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. కనిపిస్తే చెప్పాలని కోరారు.
Also Read : CM KCR Announce : 31న తెలంగాణ కేబినెట్ భేటీ